ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే… ధరలు నియంత్రణలోకి వస్తాయనే వాదన ఉంది. దీనిపై స్పందించారు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు సుబ్రమణియన్.. ‘ఈ ప్రతిపాదనకు నేను మద్దతిస్తున్నా. దీనిపై నిర్ణయాధికారం జీఎస్టీ కౌన్సిల్ దే’ అని అన్నారు త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇది రాజకీయాంశంగానూ మారగా.. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం ఆసక్తిగా మారింది
Read More »రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది. రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ …
Read More »స్వయం ఉపాధివైపు యువత మొగ్గు
స్వయం ఉపాధిని కోరుకునే యువతకు రాష్ట్ర ప్రభు త్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నది. అభిరుచి, అనుభవం, అర్హతలున్న యువత తమ కాళ్ల మీద తా ము నిలబడేందుకు సర్కార్ అనేక పథకాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వా రా అర్హులైన యువతీ, యువకుల నుంచి సబ్సిడీ రుణా ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. ఎస్సీ కార్పొరేషన్ …
Read More »ఈ వార్త సోషల్ మీడియా వాడే వాళ్లకు మాత్రమే..?
సోషల్ మీడియాలో ఇవి పెట్టకండి వేలిముద్రలు స్పష్టంగా కనిపించేలా విక్టరీ సింబల్ చూపిస్తూ పోజిస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టకండి విహార యాత్రలకు వెళ్తున్నప్పుడు వివరాలు తెలపకండి పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటివి ఏడాదితో సహా వెల్లడించకండి బహిరంగ వెబ్ సైట్లలో ఫోన్ నంబర్లు ఇవ్వకండి పిల్లల ఫొటోలను పెట్టడం వీలైనంతగా నివారించండి వీటి సాయంతో హ్యాకింగ్లు, ఆన్లైన్ మోసాలు ఇతర నేరాలు జరిగే అవకాశాలు ఎక్కువ
Read More »వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్
వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బంపర్ ఆఫర్ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా (Vi) తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రిపెయిడ్ కస్టమర్లకు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటా ఉచితంగా అందిస్తోంది. రూ.249 ఆపైన అన్లిమిటెడ్ డైలీ డేటా రీఛార్జ్ కు ఇది వర్తిస్తుంది. రాత్రి 12 గంటల నుంచి ఉదయం వరకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా ఫ్రీ డేటా వాడుకోవచ్చు. డైలీ డేటా కోటా అలాగే ఉంటుంది …
Read More »ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం వరుసగా ఐదో రోజు పెరిగాయి. గత మంగళవారం నుంచి ఇంధన ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ.88 మార్కును దాటింది. డీజిల్ రికార్డ్ గరిష్టానికి చేరుకుంది. తాజాగా పెట్రోల్ ధరలు వివిధ నగరాల్లో 30 నుంచి 51 పైసలు పెరిగింది. డీజిల్ ధరలు 36 …
Read More »తెలంగాణలో క్వింటాల్ మిర్చి రూ.13,700
తెలంగాణ రాష్ట్రంలో మిర్చి రేటు ఘాటెక్కింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం తేజా రకం, డీలక్స్ రకం మిర్చి గరిష్టంగా క్వింటాల్ రూ.13,700 పలికింది. నిన్న ఒక్కరోజే రైతులు 50 వేల మిర్చి బస్తాలను మార్కెట్ కు తీసుకొచ్చారు. దీంతో మార్కెట్ మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. మరోవైపు పత్తిని గరిష్ఠంగా క్వింటాల్ రూ.6 వేలకు వ్యాపారులు కొనుగోలు చేశారు. క్వింటాల్ పత్తికి కేంద్రం మద్దతు ధర రూ. 5,825గా …
Read More »తెలంగాణలో కందులకు రికార్డు ధర
తెలంగాణలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్లో కందులకు రికార్డు స్థాయి ధర పలికింది . ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.6 వేలు ఉంటే ట్రేడర్లు రూ.7,129 చెల్లించి కొనుగోలు చేశారు రాష్ట్రంలో ఇదే రికార్డు ధర అని అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో క్వింటాల్‌కు రూ.6,675, ఏనుమాములలో రూ.6,476 ధర పలికింది. సకాలంలో వానలు పడటం, వాతావరణం అనుకూలించడంతో పంట దిగుబడి పెరిగింది
Read More »గూగుల్ పొమ్మంది.. మైక్రోసాఫ్ట్ రమ్మంది
మీడియా సంస్థల వార్తలను తమ ప్లాట్ ఫాంపై చూపిస్తున్నందుకు ఆ సంస్థలకు రెమ్యూనరేషన్ ఇవ్వాలన్న ఆస్ట్రేలియా ప్రభుత్వ నిర్ణయానికి మైక్రోసాఫ్ట్ సానుకూలంగా స్పందించింది. అయితే కొంతకాలంగా గూగుల్, ఫేస్ బుక్ ఇందుకు నిరాకరిస్తున్నాయి. ఇది ఆచరణ సాధ్యం కాదని గూగుల్ తెలిపింది. అవసరమైతే ఆస్ట్రేలియాలో తమ సేవలు నిలిపేస్తామంది. ఈ క్రమంలోనే తమ బింగ్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా మైక్రోసాఫ్ట్ తాజా ప్రకటన చేసింది
Read More »మద్యం ప్రియులకు శుభవార్త
దేశంలోని మద్యం ప్రియులకు శుభవార్త.. అదేంటంటే పెట్రోల్, డీజిల్ తరహాలోనే మద్యంపై 100శాతం అగ్రి ఇన్ ఫ్రాస్టక్చర్ అండ్ డెవలప్ మెంట్ సెస్ (AIDC) విధించిన కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా ధరల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని స్పష్టత ఇచ్చింది. ప్రస్తుతం ఇంపోర్టెడ్ మద్యంపై 150శాతం కస్టమ్స్ డ్యూటీ విధిస్తుండగా.. దాన్ని 50శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మద్యంపై కస్టమ్స్ డ్యూటీ, AIDC కలిపి మొత్తంగా 150శాతానికే పరిమితం అవుతుందని …
Read More »