ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ.1,999 విలువైన జియో ఫీచర్ ఫోన్ కొన్న వారికి 24 నెలల పాటు అన్లిమిటెడ్ సర్వీస్ అందిస్తోంది.
రూ.1,499కి లభించే మరో ఫీచర్ ఫోన్ కొంటే 12 నెలల సర్వీస్ కల్పిస్తోంది. ఈ రెండు ప్లాన్లలో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు నెలకు 2 జీబీ (4G) డేటా వాడుకోవచ్చు. ప్రస్తుతం జియో ఫోన్ వాడుతున్న వారు రూ.749తో రీఛార్జ్ చేసినా ఈ ఆఫర్ వర్తిస్తుంది.