Home / LIFE STYLE (page 45)

LIFE STYLE

బీజేపీ నేతకు కరోనా

కేంద్ర అధికార పార్టీ బీజేపీకి చెందిన మరో నేతకు కరోనా పాజిటీవ్ గా నిర్ధారణ అయింది.బీజేపీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటీవ్ అని తేలింది. అయితే ఆయన తల్లికి కరోనా నెగిటివ్ అని తేలడం విశేషం..కరోనా లక్షణాలు కన్పించడంతో జ్యోతిరాదిత్య సింధియా,ఆయన తల్లి సోమవారం దక్షిణ ఢిల్లీలోని మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రిలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇటీవల జ్యోతిరాదిత్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి చేరారు..

Read More »

కేంద్రం సంచలన నిర్ణయం..కరోన కట్టడి కోసం ఆ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే

దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్‌-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్‌ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్‌, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ …

Read More »

మృగశిర కార్తెలో చేపలను ఎందుకు తింటారు

మృగశిర కార్తె ప్రవేశం రోజు ఏ ఇంట చూసినా చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ఫ్రైయ్యో చేసుకొని ఎప్పుడూ తినని వారు సైతం ఆరోగ్యం కోసం రెండు ముక్కలు నోట్లో వేసుకుంటారు. ఇక చేపలు మొత్తంగా ఇష్టం లేని వారు రొయ్యలు, ఎండ్రికాయలతో పులుసు చేసుకొని జుర్రుకుంటారు. మరికొందరైతే ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురుతో కలిపి వండుకుంటారు. మృగశిర కార్తె ప్రవేశం రోజు చేపలకు భళే గిరాకీ …

Read More »

లాక్‌డౌన్‌ వేళ.. ఆన్‌లైన్‌ ప్రేమ

లాక్‌డౌన్‌ పుణ్యమా అని యువకులు రోడ్ల మీదికొచ్చి ‘ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా’ అంటూ నెచ్చెలి కోసం వెతికే పరిస్థితి లేదు. ‘ఇతడే.. నే కలగన్న నా వరుడు’ అంటూ యువతులు మనసుపారేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రేమ కోసం ‘ఆన్‌లైన్‌’ బాట పట్టారు. లాక్‌డౌన్‌తో కలిగిన ఒంటరితనాన్ని డిజిటల్‌ ప్రేమతో చెరిపివేసేందుకు తాపత్రయపడుతున్నారు. ఇదే అదునుగా డేటింగ్‌ యాప్‌లు సైతం కొత్త కొత్త ఫీచర్లతో ముందుకొస్తున్నాయి. ఫలితంగా రెండు నెలలుగా …

Read More »

ఏపీలో కరోనా రోజుకో రికార్డు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా దూకుడుకు అడ్డుకట్ట పడటం లేదు. గత మూడురోజుల నుంచి 80కి తక్కువ కాకుండా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 82 కేసులు వెలుగు చూశాయి. దీంతో పాజిటివ్‌ల సంఖ్య 1,259కి చేరింది. రాష్ట్రంలో మొదటి 603 కేసులు నమోదు కావడానికి 38రోజులు పట్టగా ఆ తర్వాత 656 కేసులు కేవలం 10రోజుల్లోనే వెలుగు చూశాయి. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 17మంది …

Read More »

కరోనా కట్టడికి మార్గం ఇదే

కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ప్రఖ్యాత వైరాలజిస్ట్‌ ఇయాన్‌ లిప్కిన్‌ అన్నారు. అప్పటివరకూ సామాజిక దూరం పాటిస్తూ మహమ్మారికి ముప్పును తప్పించుకోవాలని సూచించారు. ప్లాస్మా థెరఫీ ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది మరికొద్ది రోజుల్లో వెల్లడికానుందని అన్నారు. కోవిడ్‌-19 గబ్బిలాల నుంచి మానవుడికి వ్యాపించిందని, దీన్ని ఎవరూ లేబొరేటరీల్లో సృష్టించలేదని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు. కరోనా వైరస్‌ అత్యంత భయానకపమైనదేమీ కాదని లిప్కిన్‌ వ్యాఖ్యానించడం గమనార్హం.

Read More »

100కి 20మందిలో కరోనా లక్షణాలు

దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగులకంటే అంతకు నాలుగురెట్లు కొవిడ్‌-పాజిటివ్‌ ఉన్నవారు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)కి చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రమన్‌ గంగాఖేడ్కర్‌ వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో తమ వద్దకు …

Read More »

కోవిడ్‌-19పై విజయం సాధించేందుకు మోదీ చెప్పిన ఏడు సూత్రాలు

యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌(కోవిడ్-19)పై విజయం సాధించేందుకు ప్రతి భారతీయుడు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన సూత్రాలను ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం జాతిని ఉధ్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు పాటిస్తున్న నిబంధనలు అన్ని అప్పటివరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే తన ప్రసంగాన్ని ముగించే ముందు ప్రతీ భారతీయుడు పాటించాల్సిన …

Read More »

కరోనా లక్షణాలు ఎన్ని రోజులకు కన్పిస్తాయి..?

కోవిడ్-19(కరోనా వైరస్)…ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటే ఏమిటీ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది? దాని లక్షణాలేమిటీ? అన్న అంశాలను నిశితంగా పరిశీలిద్దాం… వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వాతావరణంలో చేరి, గాలి ద్వారా …

Read More »

కామారెడ్డిలో 12కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వచ్చిన 22 మంది రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు బాన్సువాడలోనే 11 కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేస్తున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat