‘ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గత ప్రభుత్వ వైఫల్యం.. కరువు జిల్లా ‘అనంత’లో రైతులు కుదేలయ్యారు. పదిమందికి అన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్రా…అంటూ ఉపాధి లేక పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు ఉపయోకరంగా ఉంటుంది’ అని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి …
Read More »కేంద్ర బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చింది ఇవే..!
ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యే లభించింది. ఏపీకి సంబంధించి జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు గురించి, కొత్త రాజధాని నిర్మాణానికి నిధులు గురించి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు అంశాన్ని కానీ ఆమె పేర్కొనలేదు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలుగు ప్రజలకు నిరాశను మిగిల్చింది. తెలంగాణకు సంబంధించి ఎటువంటి నిధుల విడుదల ప్రస్తావనా లేదు.. అసలు రాష్ట్రానికి ఎన్ని నిధులు …
Read More »కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో ఏపీకి అన్యాయం..!
కేంద్ర ఆర్థిక బడ్జెట్ నిరాశ పరిచిందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని పెదవి విరిచారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై ఏమీ మాట్లాడలేదని, కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఎన్ని నిధులు కేటాయిస్తున్నారని దానిపై స్పష్టత లేదని తెలిపారు. …
Read More »కేంద్ర బడ్జెట్-ప్రతి మహిళకు రూ.1,00,000
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో 2019-20ఏడాదికి చెందిన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ”దేశంలో మహిళల నాయకత్వానికి తమ ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తామని”హామీచ్చారు. అందులో భాగంగా తాజా బడ్జెట్లో స్వయం సహయక సంఘాలకు వరాలు ప్రకటించారు నిర్మలా. వీరికి మద్ధతుగా ముద్రయోజన వర్తింపజేస్తామని తెలిపారు. ముద్రయోజన కింద డ్వాక్రా మహిళలకు …
Read More »2019-20కేంద్ర బడ్జెట్-ధరలు తగ్గేవి.పెరిగేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంటులో 2019-20కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కొన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా.. మరికొన్ని వర్గాలకు నష్టం చేకూర్చేలా ఉందని ప్రతిపక్షాలు,విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏమిటో తెలుసుకుందామా..? పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, …
Read More »ఇంటి లోన్ తీసుకుంటున్నవారికి గుడ్ న్యూస్..!
దేశ వ్యాప్తంగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నవారికి కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త ఇళ్లును నిర్మించుకోవాలని అనుకుంటున్నవారికి మరింత చేయూతనిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా తెలిపారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ” రూ.45లక్షల లోపు గృహారుణాలపై రూ.3.5లక్షలవరకు వడ్డీ మినహాయింపు ఇస్తామని”తెలిపారు. పదిహేను సంవత్సరాల గరిష్ఠ కాలపరిమితితో 2020 మార్చి 31లోపు రుణాలు …
Read More »కోట్ల మంది మధ్య తరగతి కుటుంబాలకు మంచి వార్త చెప్పిన మోది ప్రభుత్వం.. దేశమంతా హర్షం
కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 కి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈసందర్భంగా కొత్త పథకాలకు బడ్జెట్‌లో శ్రీకారం చుట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆమె కొత్తగా మత్స్యకారుల సంక్షేమంకోసం ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజన పేరిట కొత్త పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా కొత్తగా ‘హర్ …
Read More »కేంద్ర బడ్జెట్‌లో శుభవార్త
కేంద్రం బడ్జెట్‌లో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. దీనిలో భాగంగా రూ.5లక్షల వరకూ సాంవత్సరిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో కొన్ని కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. కానీ రూ.2 కోట్లకు పైగా వార్షికాదాయం …
Read More »సొంతింటి కలలు కనే వారికి కేంద్రం శుభవార్త
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పలు కీలక కేటాయింపులకు సంబంధించిన కొన్ని ప్రకటనలు చేశారు.అందులో భాగంగా ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద కొత్తగా 1.97కోట్ల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. 114 రోజుల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని నిర్మల స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల భూముల్లో పేదలకు ఇళ్లు నిర్మించి …
Read More »కేంద్ర బడ్జెట్లో షాక్..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్య తరగతి వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో బంగారంపై కస్టమ్స్ చార్జ్‌లు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 10 నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇక …
Read More »