దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 76వేలు దాటాయి.
Read More »అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల
కేంద్రంలో అధికారంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీరులను రిక్రూట్ చేసుకునేందుకు ఇండియన్ ఆర్మీ ఈ రోజు సోమవారం నోటిఫికేజన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్ ర్యాలీలకు జూలై నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొన్నది. దీనికి సంబంధించిన ప్రకటన రిలీజ్ చేశారు. రక్షణశాఖలో కాంట్రాక్టు పద్ధతిలో నాలుగేళ్ల కోసం సైనికుల్ని రిక్రూట్ చేయనున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్ ద్వారానానే …
Read More »అగ్నిపథ్ పై కేంద్రం తాజా నిర్ణయం
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకోచ్చిన అగ్నిపథ్ పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి మనం సంగతి విదితమే. కేంద్ర సర్కారు తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలి బ్యాచ్ అగ్నివీరులకు ఐదేళ్ల వయో పరిమితి సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అస్సాం రైఫిల్స్, CAPFలలో 10% పోస్టులను అగ్నివీరులతో భర్తీ చేస్తామంది.
Read More »దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు
దేశంలో వారం రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 13,216 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,840 మంది మరణించారు. మరో 68,108 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 23 మంది బాధితులు కరోనాకు బలవగా, 8148 మంది డిశ్చార్జీ అయ్యారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 4,165 కేసులు …
Read More »దేశంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త
రానున్న సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత ఎనిమిదేళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలిస్తున్నామని వెల్లడించింది. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలిచ్చామ్ము. 2022-23లో మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి, డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Read More »ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ వద్ద ఓ మినీ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా యూపీ పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 26 మంది ఓ మినీ బస్సులో అయోధ్య, కాశీ సందర్శనకు ఈ నెల 10న …
Read More »దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ
దేశంలో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కొత్తగా కరోనా కేసుల సంఖ్యతో మరోసారి దేశంలో వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లు కన్పిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 12 వేలు దాటింది. కొత్తగా 12,213 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 26 తర్వాత అంటే …
Read More »మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో మహారాష్ట్రలో 2,956 మందికి వైరస్ సోకగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే 1,724 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 18వేలు దాటాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1,118 కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 3వేలు దాటాయి.
Read More »దేశంలో కొత్తగా 8,822 మందికి కరోనా వైరస్
భారత్ దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా గడిచిన గత 24గంటల వ్యవధిలో 8,822 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే (6,594) పోలిస్తే ఈ రోజు 2,298 కేసులు పెరిగాయి. మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నుంచి 5,718 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.66 …
Read More »రూ.54కే లీటర్ పెట్రోల్.. ఈ ఒక్కరోజే బంపర్ ఆఫర్
లీటర్ పెట్రోల్ కేవలం రూ.54 మాత్రమే. ఎప్పుడో పెట్రోల్ రేట్ సెంచరీ దాటేస్తే.. ఇంత తక్కువకేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదివింది నిజమేనండీ బాబూ! మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఓ బంక్‌లో ఈరోజంతా అదే రేటుకు పెట్రోల్ అమ్మారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్‌సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బర్త్‌డే సందర్భంగా ఆయన అభిమానులు ఈ ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్‌లోని క్రాంతి చౌక్ పెట్రోల్ బంక్‌లో రూ.54కే లీటర్ పెట్రోల్ అందజేశారు. దీంతో …
Read More »