ప్రముఖ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? తెరవెనుక అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తమిళనాడులో అలాంటి చర్చే నడుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవితో రజనీకాంత్ సమావేశమయ్యారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సుమారు అరగంటపాటు గవర్నర్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా ఆయన మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. రాజకీయాలపైనా ఇద్దరమూ చర్చించుకున్నామని.. …
Read More »చంద్రబాబు ఎదుటే కేశినేని నాని ఫ్రస్టేషన్!
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టారు. విజయవాడలో తన సోదరుడు కేశినేని శివనాథ్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారంటూ గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న కేశినేని నాని.. పార్టీ అధినేత ముందే తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలుకుతూ బొకేలు అందించి ఫొటోలు దిగారు. ఈ …
Read More »తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గుడ్ న్యూస్
రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కానుక ప్రకటించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని 57 ఏళ్లు నిండిన వారికి ఆగస్టు 15 నుంచి కొత్తగా పెన్షన్లు అందజేయనున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 36లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని.. కొత్తగా మరో 10లక్షల మందికి ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ చేయించుకుంటున్న కిడ్నీ రోగులుకు …
Read More »దేశవ్యాప్తంగా చర్చ జరగాలి.. అందుకే బాయ్‌కాట్ చేస్తున్నా: కేసీఆర్ ఫైర్
సమాఖ్య, సహకార స్ఫూర్తిని భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని.. మహాత్మాగాంధీ చరిత్రను మలినం చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించారు. ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేంద్ర ప్రభుత్వం, భాజపా వైఖరిపై తీవ్రస్థాయిలో కేసీఆర్ మండిపడ్డారు. గాంధీకి లేని అవలక్షణాలను ఆయనకు అంటగట్టి హేళన చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. గత ఆర్థిక సంవత్సరంలో పథకాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.90లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్ర ప్రభుత్వం …
Read More »అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్
కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో కోమటిరెడ్డి బ్రదర్స్ భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఢిల్లీలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేర్వేరుగా అమిత్‌షాతో సమావేశమయ్యారు. తెలంగాణ వరద సాయం కోసం అమిత్‌షాను కలిసిన ట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. వరదలతో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లిందని.. ఆ విషయంపై అమిత్‌షాతో చర్చించినట్లు తెలిపారు. పదవుల కోసం వెంటపడే …
Read More »రేవంత్ కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించారు: దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో ఝలక్ తగిలింది. ముఖ్యనేత దాసోజు శ్రవణ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను భ్రష్ణుపట్టిస్తున్నారని.. ఆయన నాయకత్వంలో పనిచేయలేమని తేల్చిచెప్పారు. రేవంత్ కాంగ్రెస్ కోసం పనిచేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో మాఫియా తరహా రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ కోసం పాటుపడిన తమనే …
Read More »‘ఉమామహేశ్వరి సూసైడ్.. చంద్రబాబు వచ్చాకే ఆ లేఖ మాయం చేశారు’
ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి బలవన్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి చంద్రబాబు లేఖ రాసి తన నిజాయతీని నిరూపించుకోవాలని సూచించారు. ఆస్తి తగాదాలతో మానసిక వేదనకు గురిచేయడంతోనే ఉమామహేశ్వరి చనిపోయినట్లు తెలుస్తోందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని …
Read More »రేవంత్.. అప్పుడేం పీకావ్?.. రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పీసీసీ అధ్యక్ష పదవిని డబ్బులిచ్చి కొనుక్కున్నారని.. సీఎం అయిపోయి రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆయన చూస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి.. రేవంత్ తనపై చేసిన విమర్శలకు ఘాటుగా బదులిచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారుతున్నట్లు రేవంత్ ఆరోపించారని.. అదే …
Read More »అనుకున్నదే అయింది.. కాంగ్రెస్‌కు రాజగోపాల్‌రెడ్డి గుడ్‌బై!
అనుకున్నదే అయింది. కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. త్వరలోనే తన రాజీనామా లేఖను స్పీకర్‌ను అందజేస్తానని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అంటే తనకు గౌరవముందని.. కాంగ్రెస్ పార్టీని విమర్శించనని తెలిపారు. ప్రజలు కోరుకుంటే మునుగోడు నుంచే మళ్లీ పోటీ చేస్తానన్నారు. …
Read More »భూ సర్వే.. సీఎం జగన్ కీలక నిర్ణయం
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారానికి ప్రతి మండల కేంద్రంలో శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో జగన్ మాట్లాడారు. ‘జగనన్న భూరక్ష’ కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా ట్రైబ్యునళ్లు కొనసాగించాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భూసర్వేలో తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు సరైన యంత్రాంగం ఉండాలని సీఎం ఆదేశించారు. మొబైల్ ట్రైబ్యునల్ యూనిట్లు ఉండాలని.. …
Read More »