తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు మరో నలుగురిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.పోయిన శనివారం తమశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కొత్తగూడెం అటవీశాఖ డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ పిచ్చేశ్వరరావు సోమవారం లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ సమీపంలోని పాత హెలీప్యాడ్ స్థలంలో శనివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అటవీభూముల చుట్టూ ప్రహరీ …
Read More »పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం కడియం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ,టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహారి గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కడియం శ్రీహారి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. తనపై వస్తున్న వార్తలపై కడియం శ్రీహారి …
Read More »పండుగలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నెల ఇరవై ఏడో తారీఖున ఆ పార్టీ నేతలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,మంత్రులతో సమావేశం అయిన సంగతి విదితమే. ఈ సమీక్ష సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి దిశ నిర్ధేశం చేసిన సంగతి కూడా తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి యాబై వేల మంది వరకు సభ్యత్వ నమోదు చేయించాలి. మొత్తం …
Read More »హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వం భద్రత కుదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను కొనసాగించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కోర్టు మంగళవారం విచారించనుంది. అయితే గతంలో చంద్రబాబుకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీతో పాటు ముగ్గురు ఆర్ఐ బృందాలతో భద్రత కల్పించారు. తాజాగా ఆ బృందాన్ని కుదించి సెక్యూరిటీ తగ్గించడంతో తనకు కుదించిన భద్రతను …
Read More »బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందే.. ఆ మీడియా సంస్థలపై కడియం ఆగ్రహం..!!
తనపై తప్పుడు వార్తలు ప్రచురించిన కొన్ని మీడియా సంస్థలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ మేరకు అయన బహిరంగ లేఖ విడుదల చేశారు. బహిరంగ లేఖ ————— గౌరవ సంపాదకులకు.. డెక్కన్ క్రానికల్, హెచ్ఎంటీవి, మహాన్యూస్… మిత్రులారా…. నాపై తప్పుడు వార్తలు ప్రచురించినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పి, వెంటనే ఖండన వార్త ప్రచురించాలి. నేను బిజెపిలో చేరుతున్నట్లు ఇటీవల మీ డెక్కన్ …
Read More »టీడీపీ కాపు నాయకులంతా మూకుమ్మడిగా కమలం గూటికి చేరనున్నారా
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, గోదావరి జిల్లాలో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు కమలం గూటికి చేరనున్నారని తెలుస్తోంది. తాజా పరిణామాలను చూస్తుంటే తోట పార్టీ మారుతున్నారని తెలుస్తోంది. ఇటీవలతనకు బీజేపీలో చేరాలంటూ ఆహ్వానాలు అందుతున్నాయంటూ తోట త్రిమూర్తులు స్వయంగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగుదేశం పార్టీని వీడే ఆలోచన లేదని తోట స్పష్టంచేశారు. తాజాగా విజయవాడలోని మాజీ ఎమ్మెల్యే బోండ ఉమ నివాసంలో ఏపీలోని కాపు …
Read More »కేటిఆర్ కు రుణపడి ఉంటాం..!!
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి తానున్నానంటూ సాయం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం వేముల సదానందం అనే నేత కార్మికుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అతని భార్య కవిత, ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు. అద్దె ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఇల్లు ఖాళి చేయించాడు. నిలువనీడ లేని …
Read More »మిషన్ భగీరథతోనే తాగునీటి కష్టాలకు చెక్..!!
మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుతోనే తాగునీటి కష్టాలకు చెక్ పెట్టొచ్చన్నారు ఉత్తరప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, తాగునీటి శాఖ ప్రత్యేక కార్యదర్శి సురేంద్ర రామ్(IAS). భారీ ప్రాజెక్టు ఐన భగీరథను తక్కువ కాలంలో పూర్తిచేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు ను అధ్యయనం చేయడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంజనీర్ల బృందంతో వచ్చిన సురేంద్రరామ్, ఇవాళ ఎర్రమంజిల్ లోని భగీరథ ప్రధాన కార్యాలయంలో ఈ.ఎన్.సి కృపాకర్ రెడ్డిని కలిశారు. …
Read More »సిద్ధ రామయ్య ఇంట్లో అత్యవసర సమావేశం.. పరిశీలిస్తోన్న బీజేపీ.. అసలేం జరుగుతోంది.?
పక్కరాష్ట్రం కర్ణాటకలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. తాజాగా బళ్లారి జిల్లాలోని విజయ్‌నగర్ నియోజక వర్గం ఎమ్మెల్యే ఆనంద్ బి సింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. అలాగే బెల్గాం జిల్లా గోకక్ నియోజకవర్గానికి చెందిన మరో శాసన సభ్యుడు రమేశ్ జర్కి హోలి కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడు. ఇద్దరు కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో సంకీర్ణ ప్రభుత్వం మళ్లీ ఇబ్బందులు ఎదుర్కొంటుందనే సంకేతాలు …
Read More »డీజీపీ హెచ్చరికతో వెన్నులో వణుకుతో తెలుగు తమ్ముళ్లు
మరోసారి ఏపి రాజకీయాల్లో పాలక, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. కాకపోతే అప్పుటి అధికార పక్షం ప్రతిపక్షంగా, ప్రతిపక్షం అధికార పక్షంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారు. తాజాగా మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను కలిశారు. రాష్ట్రవ్యాప్తంగా వైసిపి కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్ జగన్ గెలుపు చంద్రబాబు ఓటమి పట్ల ఆపార్టీ కార్యకర్తలు అక్కసుతో ఉన్నారని, …
Read More »