టీఆర్‌ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్‌లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త …
Read More »ఈరోజు సిటీలో నైట్ ఆ టైం వరకు మెట్రో సేవలు..!
వినాయక నిమజ్జనానికి తరలివచ్చేవారి కోసం నేడు మెట్రో ట్రైన్ సేవలను పొడిగించినట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి ఒంటి గంట వరకు ట్రైన్లు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. ఎల్‌బీనగర్, నాగోల్, రాయదుర్గం, మియాపూర్, జేబీఎన్, ఎంజీబీఎన్ స్టేషన్లలో చివరి ట్రైన్ ఒంటి గంటకు ప్రారంభం అవుతుంది. అంటే చివరి స్టేషన్లకు 2 గంటలకు చేరుకుంటాయి. హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చూడాలి అనుకుంటే ప్రయాణికులు సమీప స్టేషన్లు …
Read More »తెగిన హైడ్రోజన్ బెలూన్ తాడు.. 2 రోజులు గాల్లోనే రైతు..!
హైడ్రోజన్ బెలూన్ తాడు తెగి ఓ వ్యక్తి రెండు రోజులు గాల్లోనే ఉన్న ఘటన ఈశాన్య చైనాలోని హిలాంగ్ షియాంగ్ ప్రావిన్సులో జరిగింది. హైడ్రోజన్ బెలూన్ సాయంతో ఇద్దరు రైతులు చెట్ల నుంచి పైన్ కాయలు కోస్తుండగా ఉన్నట్టుండి దాని తాడు తెగింది. ఆ టైంలో ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి కిందకు దూకేశాడు. హు అనే మరో వ్యక్తి మాత్రం అందులోనే చిక్కుకున్నాడు. బెలూన్ నుంచి కిందకి దూకిన …
Read More »వేధించిన వ్యక్తితోనే అమలాపాల్ రెండో పెళ్లి..!
నటి అమలాపాల్ తన ఫ్రెండ్, పంజాబీ సింగర్ భవ్‌నిందర్‌సింగ్ దత్‌ను వివాహం చేసుకుందట. అయితే ఇటీవల తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అమలాపాల్ భవ్‌నిందర్‌సింగ్ దత్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో భవ్‌నిందర్‌సింగ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ కోసం భవ్‌నిందర్‌సింగ్ తరఫు లాయర్ ఈ విషయం న్యాయస్థానంలో చెప్పి అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించాడట. అందుకే భవ్‌నిందర్‌సింగ్‌కు గ్ బెయిల్ వచ్చిందని కోలీవుడ్‌లో న్యూస్ …
Read More »మరోసారి బాలాపూర్ లడ్డూకి రికార్డు స్థాయి ధర
తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్‌చేస్తూ వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యుడైన వంగేటి లక్ష్మారెడ్డి గణనాథుని ప్రసాదాన్ని దక్కించుకున్నారు. ఇది గతేడాదికంటే రూ.5 లక్షల 70 వేలు అధికం కావడం విశేషం. 2020లో కరోనా కారణంగా లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. 2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి సొంతం …
Read More »రెండో ఎలిజబెత్ కన్నుమూత
బ్రిటన్ దేశపు మహారాణి రెండో ఎలిజబెత్ నిన్న గురువారం కన్నుమూశారు. ఎలిజబెత్ వయస్సు 96 సంవత్సరాలు. రాణి మరణవార్తను ఆమె నివాస భవనం బకింగ్‌హాం ప్యాలెస్ నిన్న గురువారం రోజు సాయంత్రం ప్రకటించింది. బ్రిటన్‌ను అత్యధిక కాలం (70 ఏండ్లు) పరిపాలించిన మహారాణిగా ఎలిజబెత్ చరిత్రకెక్కారు. రాణి మరణంతో ఆమె కుమారుడు చార్లెస్.. బ్రిటన్‌తోపాటు 14 కామన్వెల్త్ దేశాలకు రాజుగా బాధ్యతలు చేపట్టారు.ఆమె మృతదేహాన్ని ప్రజల సందర్శనార్ధం బకింగ్‌హాం ప్యాలెస్‌కు …
Read More »అభివృద్ది ,సంక్షేమం టీఆరెఎస్ తోనే సాధ్యం-MLA డా.సంజయ్
రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యులు ముఖీద్ గారి అధ్వర్యంలో అల్లిపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఏర్రవెని ఆశాలు మరియు వారి అనుచరులు 30 మందికి పైగా అనుచరులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే మాట్లాడుతూ భారత దేశం లో బీజేపీ,కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల కన్నా …
Read More »మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా కోహ్లీ
ఆసియాకప్ నామమాత్రమైన మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల నుంచి అత్యద్భుత ప్రదర్శన. ఓవైపు అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 122 నాటౌట్) తొలి శతకంతో చెలరేగగా.. బౌలింగ్‌లో పేసర్ భువనేశ్వర్ (4-1-4-5) నిప్పులు చెరిగే బంతులతో తన ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. వీరిద్దరి ధాటికి గురువారం జరిగిన మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్ 101 రన్స్ తేడాతో చిత్తుగా ఓడింది. అలాగే టీమిండియా ఆసియాక్‌పను …
Read More »దేశంలో కొత్తగా 6093 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కొత్తగా 6093 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి బయటపడగా, 18 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Read More »ఉజ్వల భారత్ కోసం ఉద్యమ వీరుడు
తెలంగాణ భూమి పుత్రుడు, రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాయకుడు, నాలుగు కోట్ల ప్రజల ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నరు. కేసీఆర్ నేతృత్వంలో, పోరుగడ్డ తెలంగాణ వేదికగా నూతన జాతీయ రాజకీయ పార్టీ అవతరించబోతున్నది. టీఆర్‌ఎస్‌లోని అత్యంత విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అవి తెలియజేసిన సమాచారం ప్రకారం అధికారమే అంతిమంగా చేసే తంత్రాలకు, పదవులే లక్ష్యంగా సాగే పంథాలకు భిన్నంగా, …
Read More »