Home / SLIDER / అభివృద్ది ,సంక్షేమం టీఆరెఎస్ తోనే సాధ్యం-MLA డా.సంజయ్

అభివృద్ది ,సంక్షేమం టీఆరెఎస్ తోనే సాధ్యం-MLA డా.సంజయ్

రాయికల్ మండల కో ఆప్షన్ సభ్యులు ముఖీద్ గారి అధ్వర్యంలో అల్లిపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ఏర్రవెని ఆశాలు మరియు వారి అనుచరులు 30 మందికి పైగా అనుచరులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.ఎమ్మేల్యే మాట్లాడుతూ భారత దేశం లో బీజేపీ,కాంగ్రెస్ పాలించే రాష్ట్రాల కన్నా అత్యధిక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అన్నారు.అల్లిపుర్ గ్రామంలో మిషన్ కాకతీయ ద్వారా రెండు పెద్ద చెరువుల్లో పూడిక తీసి కట్టలు బాగు చేయటం జరిగింది అని గత ప్రభుత్వాలు ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదు అని అన్నారు అల్లిపూర్ లో కుల సంఘం భవనాలకు నిదులు మంజూరు చేశామని అన్నారు..

కళ్యాణ లక్ష్మి,షాది ముభరక్,సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేయటం జరిగింది అని పేదల పక్షపాతి ప్రభుత్వం టీఆరెఎస్ ప్రభుత్వం అన్నారు.దేశం ధర్మం అంటూ కొన్ని పార్టీ లు యువకులను రెచ్చ గొట్టి పబ్బం గడుపుతున్నరు అని అన్నారు.ప్రతిపక్షాలు వారు చేసిన అభివృద్ధి పనులు చెప్పలేకనే కుల,మత చిచ్చు రాజేసి కాలం వెళ్ళదీస్తున్నయి అని అన్నారు.ముఖ్యమంత్రి గారు అన్ని కుల మతాల అభివృద్ధికి కృషి చేస్తారని గౌరవిస్తారని,శాంతి భద్రతలకు తెలంగాణ నంబర్ వన్ అని అన్నారు.ప్రపంచం లో రూపాయి విలువ తగ్గింది అని దేశం విలువ పతనం అయిందని అన్నారు…నిరుద్యోగులకు,యువకులను రెచ్చగొట్టడం కాకుండా వృత్తి విద్య పై దృషి పెట్టీ ఉద్యోగాల కల్పన చేయటం పై కేంద్రం దృష్టి సారించాలని అన్నారు…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల కల్పన,1లక్ష 50 వేల పైన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు…కేంద్రం ఎన్ని నియామకాలు చేపట్టింది తెలపాలని ప్రశ్నించారు. కేటీఆర్ గారి కృషి తో హైదరాబాద్ ఐటి లో అగ్రగామిగా నిలిచింది అని అన్నారు..అందరికీ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తామని ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వనికి అండగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్,రాయికల్ పట్టణ అధ్యక్షుడు ఇంతియాజ్,జిల్లా కౌన్సిలర్ ఫోరం పంబల రామ్ కుమార్,కౌన్సిలర్ అల్లే గంగ సాగర్ ,నాయకులు ఏర్రవేనితిరుపతి,జాన గంగాధర్, వెంకటేశ్వర్ రావు,వినోద్ రావు,జహంగీర్,దాసరి ప్రవీణ్,ఉపాధ్యక్షులు దుమల రాజ్ కుమార్,కార్మిక విభాగం తొలిప్రేమ శ్రీనివాస్,యూత్ ప్రధాన కార్యదర్శి శరత్ రావు,మండల యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, సుంకే మహేష్,ఎస్టీ విభాగం శ్రీరామ్ బిక్ష పతి,ఢిల్లీ రామారావు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat