జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రి పవన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ ఇవాళ సమావేశం అయ్యే అవకాశం ఉంది. త్వరలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read More »తల్లిని మించిన గేదే..?
ఏపీలో వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ఓ ముర్రా జాతి గేదె రికార్డు స్థాయిలో పాలు ఇస్తోంది. ముత్యాల సత్యనారాయణకు చెందిన తల్లి గేదె రోజుకు 26.58 లీటర్ల పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచాయి.. నాలుగేళ్ల వయసున్న పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లికి మించి రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో దారుణం
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకున్నది. ప్రియుడి మోజులోపడి ఓ బాలిక కన్న తండ్రిపై దాడికి పాల్పడింది. నగరంలోని అక్కయ్యపాలెం శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నది. ఆమెకు ఐటీఐ చదువుతున్న ఓ బాలుడితో పరిచయమైంది. రోజులు గుడుస్తున్న కొద్ది అదికాస్త ప్రేమగా మారింది.అతడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. తన ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, 8 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. …
Read More »శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం నుండి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌కు ఏపీలోని గుంటూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. గుర్తుతెలియని దుండగులు గుంటూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలోని కంకరగుంట గేటు వద్ద రైల్వేట్రాక్‌పై అడ్డంగా ఇనుపరాడ్‌ను కట్టారు. ఎవరికి అనుమానం రాకుండా దానిపై అట్టముక్కలు పెట్టారు. పది నిమిషాల్లో శబరి ఎక్స్‌ప్రెస్ ఈ మార్గంలో వెళ్లే సమయంలో స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం అందించగా హుటాహుటిన …
Read More »గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలు ఇవే.!
సూర్యగ్రహణం పూర్తవుతోంది. సాయంత్రం 5.03 నిమిషాలకు ప్రారంభమైన పాక్షిక సూర్యగ్రహణం.. 5.45 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలను చూద్దాం. గ్రహణం పూర్తవగానే ఇంట్లోని వారంతా విడుపు స్నానం చేయాలి. ఈ నియమాన్ని అందరూ కచ్చితంగా పాటించి తలంటుకోవాలి. పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలు, విగ్రహాలను శుద్ధి చేయాలి. దానితో పాటు వంటకాలు, ఇంట్లోని వస్తువులపై ఉంచిన దర్భ గడ్డిని తీసేయాలి. స్నానమాచరించిన తర్వాత ఇంటిని …
Read More »ఏపీలో గ్యాంగ్‌రేప్ కలకలం
ఏపీలో కడప జిల్లాలో ఓ విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్ కలకలం రేపుతుంది.జిల్లాలోని గోపవర మండలం రాచాయపేటలో ఎనిమిదో తరగతి చదివే ఓ విద్యార్థినిపై సామాహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను నిందితులు ఫోన్‌లో చిత్రీకరించి బాలికపై పలుమార్లు లైంగికదాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడింది పది, ఇంటర్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి రావడంతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు …
Read More »చంద్రబాబుకు వాళ్లిద్దరే గురువులు: మంత్రి బొత్స
టీడీపీ అధినేత చంద్రబాబుకు మానవత్వం, విలువలు లేవని.. పండగ రోజు కూడా రాజకీయ ఉపన్యాసాలు ఇస్తూ గురువలను అవహేళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీచర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సీఎం సత్కరించారని.. ఈ విషయం టీడీపీ నేతలకు మింగుడు పడటం లేదని వ్యాఖ్యానించారు. వెన్నుపోటుకు ఆజ్యం పోసిన రామోజీరావు, రాధాకృష్ణలే చంద్రబాబుకు గురువులు …
Read More »మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఈరోజు గురువారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.250 పెరగడంతో.. రూ. 47,450గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 పెరగడంతో రూ.51,550గా ఉంది. కిలో వెండి ధర రూ.200 పెరగడంతో రూ.60,900గా ఉంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
Read More »అమిత్‌షా-ఎన్టీఆర్ మాట్లాడుకున్నది అదే.. క్లారిటీ ఇచ్చిన కిషన్‌రెడ్డి
కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ మధ్య జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారనే విషయం ఇప్పుడు హాట్‌టాపిక్ అయింది. ఎక్కడ చూసినా వాళ్లేం మాట్లాడుకుని ఉంటారనే చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. అమిత్‌షా, ఎన్టీఆర్ మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని కిషన్‌రెడ్డి చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్‌సినిమాలు, ఆయన రాజకీయ ప్రస్థానంపై డిస్కషన్ జరిగినట్లు పేర్కొన్నారు. అఅమిత్‌షా-ఎన్టీఆర్ మధ్య జరిగిన సమావేశంలో రాజకీయ అంశాలపైనా …
Read More »ఎన్టీఆర్‌తో అమిత్‌షా మీటింగ్.. కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి వాళ్లిద్దరూ కలిశారు. రాజకీయాలపై మాట్లాడుకున్నారా? సినిమాలపైనా? ఇంకైమైనా కారణాలా? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నిజంగా రాజకీయాలపైనే అయితే గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ఎన్టీఆర్ ఏం చెప్పారు? ఇలా.. అనేక అంశాలపై ఊహాగానాలు …
Read More »