ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి CM అభ్యర్థిగా పవన్ను ప్రకటించాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ‘ఇవాళ APకి వస్తున్న JP.నడ్డా దీనిపై ప్రకటన చేయాలి. ఈ ప్రకటనతో ఇరు పార్టీల బంధం బలపడి.. ప్రజల మద్దతు మరింత లభిస్తుంది. పర్యటనలో భాగంగా ఏపీ ప్రభుత్వ అవినీతి, అసమర్థతను నడ్డా ప్రస్తావించాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. జగన్ పాలనను BJP కేంద్ర …
Read More »మధ్యప్రదేశ్ లోనే ఎక్కువగా శిశుమరణాలు
దేశంలో ఎక్కువగా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనే అత్యధిక శిశుమరణాలు సంభవిస్తున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ఈ విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. ఆ రాష్ట్రంలో ప్రతీ వెయ్యి మంది నవజాత శిశువుల్లో 43 మంది మృత్యుఒడిలోకి చేరుకొంటున్నారు. మిజోరంలో అతి తక్కువ శిశుమరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఆ రాష్ట్రంలో ప్రతి వెయ్యిమంది శిశువులకు ముగ్గురు మరణిస్తున్నారు. మొత్తంగా ఏడాది నిండకుండానే దేశంలో ప్రతి 36 పసికందుల్లో ఒకరు …
Read More »ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2021-22కుగాను తగ్గించి ప్రతిపాదించిన 8.1 శాతం వడ్డీరేటును ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు ఆమోదించింది. ఈ మేరకు నిన్న శుక్రవారం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) తెలియజేసింది. ఈపీఎఫ్ పథకం సభ్యులందరికీ గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 8.1 శాతం వడ్డీరేటును చెల్లించాలన్నదానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ వెల్లడించినట్టు ఈపీఎఫ్‌వో కార్యాలయం …
Read More »గంగూలీ పొలిటికల్ ఎంట్రీ? ట్వీట్ చేసిన బీసీసీఐ చీఫ్!
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానమే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. లేటెస్ట్‌గా ఆయన చేసిన ట్వీట్ దీనికి మరింత బలం చేకూరుస్తోంది. క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు గడిచాయని.. ఇప్పుడు కొత్త మార్గంలో నడవాలని భావిస్తున్నట్లు ఆయన తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు లేఖను గంగూలీ పోస్ట్ చేశారు. ఎప్పటినుంచో గంగూలీ రాజకీయ రంగ ప్రవేశంపై …
Read More »కాంగ్రెస్‌ది తాడు.. బీజేపీ ఉరి
పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేపీ నాయకత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్నది ఇదే. నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషాన్ని తెలంగాణ ప్రజలకు మిగిల్చని క్రూర మనస్తత్వం బీజేపీది. రాష్ట్రం అధికారికంగా అమల్లోకి రాకముందే పోలవరం ముంపు …
Read More »కేసీఆర్ ఈ దేశానికి ప్రధాని కావాలి
భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్‌ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్మవారిని మొక్కుకున్నానని ఆయన చెప్పారు. వరంగల్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక మాసోత్సవ సదస్సులో మంత్రి మల్లారెడ్డి పాల్గొని ప్రసంగించారు.దేశాన్ని బీజేపీ నాశనం చేస్తోందని మల్లారెడ్డి ధ్వజమెత్తారు. దొంగలు దేశాన్ని దోచుకుని విదేశాల్లో జల్సాలు …
Read More »మోదీజీ.. ఇది గుజరాత్ కాదు.. పోరాటాల గడ్డ తెలంగాణ: హరీశ్‌రావు
తెలంగాణ గురించి మాట్లాడే హక్కు ప్రధాని నరేంద్రమోడీకి లేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలో రాష్ట్రానికి ఇచ్చిందేంటో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పర్యటనో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు చేసిన నేపథ్యంలో హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ …
Read More »తెలంగాణలో అధికారంలోకి వస్తాం: ప్రధాని మోడీ ధీమా
కుటుంబ పార్టీలను తరిమికొడితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. హైదరాబాద్‌లోని ఐఎస్‌బీ వార్షికోత్సవానికి వచ్చిన ఆయన.. బేగంపేట ఎయిర్‌పోర్టు సమీపంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో వేలమంది అమరులయ్యారని.. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు చెప్పారు. అమరవీరుల ఆశయాలు నెరవేరడం లేదని.. కుటుంబపాలనలో తెలంగాణ బందీ అయిందని మోడీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ హవా కనిపిస్తోందని.. అధికారంలోకి వచ్చితీరుతామని ఆయన ధీమా …
Read More »మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ షాక్
కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు బీజేపీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వయోభారాన్ని కారణంగా చూపి ఏడాది కిందట ఆయనను గద్దె దింపిన పార్టీ అధిష్ఠా నం తాజాగా ఆయన చిన్నకుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించింది. వారసత్వ రాజకీయాలకు చోటులేదని ప్రధాని మోదీ కుండబద్దలు కొట్టిన తరుణంలోనే అధిష్ఠానం కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు పంపిందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం యడియూరప్ప …
Read More »మరో లక్ష కోట్ల అప్పు యోచనలో కేంద్రం!
ఇప్పటికే మన దేశం లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రం ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరించడంతో ఆ అప్పులు తారాస్థాయికి చేరాయి. ఇప్పడు కేంద్రం మరో లక్ష కోట్ల రూపాయల మేర అప్పు చేసే యోచనలో ఉన్నదని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఈ లక్ష కోట్ల అప్పు కోసం మార్కెట్‌కు వెళ్లే అవకాశం ఉందని తెలిపాయి. …
Read More »