Breaking News
Home / SLIDER / కాంగ్రెస్‌ది తాడు.. బీజేపీ ఉరి

కాంగ్రెస్‌ది తాడు.. బీజేపీ ఉరి

పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేపీ నాయకత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్నది ఇదే. నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషాన్ని తెలంగాణ ప్రజలకు మిగిల్చని క్రూర మనస్తత్వం బీజేపీది. రాష్ట్రం అధికారికంగా అమల్లోకి రాకముందే పోలవరం ముంపు పేరుతో తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపింది. తెలంగాణకు తీరని అన్యాయం చేసింది. ఇప్పుడు ప్లేటు ఫిరాయించింది. ముంపు మండలాల విలీనంతో మాకు సంబంధం లేదని దబాయిస్తున్నది. ఏకంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం బీజేపీ నైజాన్ని బయటపెడుతున్నది.

కాంగ్రెస్‌ది తాడు.. బీజేపీ ఉరి

పోలవరం ముంపును బూచిగా చూపి ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాలను, భద్రాచలం, బూర్గంపహాడ్‌ మండలాల్లోని కొన్ని గ్రామాలను.. మొత్తంగా 211 గ్రామాలను ఏపీలో విలీనం చేశారు. ఇందులో కాంగ్రెస్‌, బీజేపీలది సమాన పాత్ర. కాంగ్రెస్‌ తాడు అల్లితే.. బీజేపీ ఉరేసింది.

2014 మార్చి 2: మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది.
2014 మే 27: ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్వహించిన తొలి సమావేశం. ఏడు ముంపు మండలాలను తెలంగాణ నుంచి వేరు చేసి ఏపీకి బదలాయిస్తూ ఆర్డినెన్స్‌ జారీకి తీర్మానం చేసింది.
2014 మే 29: ఏడు మండలాల విలీన ఆర్డినెన్స్‌కు నాటి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు.
2014 జూన్‌ 25: ఏడు మండలాలను తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శాశ్వతంగా కలుపాలని కోరుతూ ఏపీ అసెంబ్లీలో నాటి సీఎం చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టగా, ఏకగ్రీవ ఆమోదం. మరుసటి రోజే హుటాహుటిన చంద్రబాబు ఢిల్లీకి చేరుకొని ప్రధాని మోదీని కలిశారు. ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచితే భవిష్యత్తులో ఎదురుతిరిగే అవకాశం ఉందని, ఆర్డినెన్స్‌ను చట్టంగా మార్చాలని కోరారు.
2014 జూలై 11: ఏడు మండలాల విలీన బిల్లుకు లోక్‌సభ ఆమోదం.
2014 జూలై 14: బిల్లుకు రాజ్యసభ ఆమోదం. దీంతో బిల్లు ఆమల్లోకి వచ్చింది.

ఇప్పుడు చెప్పు కిషన్‌రెడ్డీ..

ఏడు మండలాల విలీనంలో తమ పాత్ర లేదని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏపీలో రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని చెప్తున్నారు. ఒకవేళ అది అన్యాయం అని అనిపిస్తే.. మోదీ అధికారంలోకి రాగానే ఆర్డినెన్స్‌ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. మొదటి క్యాబినెట్‌ సమావేశంలోనే ఏడు మండలాల విలీనానికి తీర్మానం చేయడం, ఆర్డినెన్స్‌ జారీ చేయడం వాస్తవం కాదా? అని నిలదీస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం జూన్‌ 2వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి.. అంతకు నాలుగు రోజుల ముందే ఆర్డినెన్స్‌ జారీ చేయడం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరించినట్టు కాదా? అని మండిపడుతున్నారు. రాష్ట్రం కండ్లు తెరువకముందే కత్తిగాటు పెట్టడం పాపం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌పైనే నిందలా?

ఏడు మండలాలను కలుపుతుంటే సీఎం కేసీఆర్‌ చూస్తూ ఉన్నారని కిషన్‌రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడారు. యూపీఏ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చిన క్షణం నుంచి ఏడు మండలాల విలీనంపై తెలంగాణ అగ్నిగుండమైంది. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ధర్నాలు, బందులు, రాస్తారోకోలతో దద్దరిల్లింది. ‘తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి రాజముద్ర వేసి.. సిరాతడి ఆరకముందే తెలంగాణ గొంతు కోస్తారా?’ అంటూ సీఎం కేసీఆర్‌ నాడు ఆవేదన వ్యక్తం చేశారు. స్వయంగా రాష్ట్రపతికి లేఖ రాశారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చిననాడు రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. ‘ఈ మాత్రం అవగాహన లేని నువ్వెలా కేంద్రమంత్రిగా కొనసాగుతున్నావ్‌?’ అని తెలంగాణ ప్రజలు నిలదీస్తున్నారు. ‘ఇదేనా నీ తెలివి’ అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum