తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,061 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 11 మంది చనిపోయారు. 1,556 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,18,837కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,524గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,618 మంది చనిపోయారు.
Read More »కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలోని వెంగళ్రావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సెంటర్ ప్రారంభోత్సవం కంటే …
Read More »డెల్టా వేరియంట్ ఎఫెక్ట్-సిడ్నీలో లాక్‌డౌన్
కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. మరి అలాంటి దేశంలో కూడా డెల్టా వేరియంట్ దడపుట్టిస్తున్నది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టా వేరియంట్ లక్షణాలున్న కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో సెంట్రల్ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్ విధించారు. వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి బాధితుని ఇంటి పక్కనున్న నాలుగు కుటుంబాలను వారం రోజులపాటు బయటకు రావద్దని అధికారులు సూచించారు. అంతర్జాతీయ విమాన …
Read More »తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 1,114 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా 12 మంది చనిపోయారు. 1280 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,16,688కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,462గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్‌తో ఇప్పటి వరకు మొత్తం 3,598 మంది చనిపోయారు. జిల్లాల వారీగా …
Read More »పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్ హెచ్చరిక
పాఠశాలలు తెరవటంపై నీతి ఆయోగ్ హెచ్చరిక కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదన్న నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బడిలో కేవలం విద్యార్థులే కాక ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కొవిడ్ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదు పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, …
Read More »చిన్నపిల్లలకు మాస్కులు వాడుతున్నారా..?-ఐతే ప్రమాదమే..?
కరోనా కారణంగా గత 15 నెలలుగా ప్రజలు బయటకు రావడం తగ్గించేశారు. ఒకవేళ బయటకు రావాల్సి వచ్చినా మాస్కులు పెట్టుకుని, భౌతిక దూరం పాటిస్తున్నారు. ఇక స్కూళ్లు మూతపడటంతో పిల్లలు ఇంటిపట్టునే ఉంటున్నారు. ఇరుగు పొరుగు పిల్లలతో ఆడుకోవడానికి కూడా వెళ్లనీయడం లేదు. దీంతో వైరస్, బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఫ్లూ, ఇతర జబ్బుల బారిన పడడటం తగ్గిపోయింది. దీంతో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల …
Read More »దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు
దేశంలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 53,256 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 88 రోజుల్లో ఇంత తక్కువగా కేసులు నమోదవడం ఇదే ప్రధమం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,35,221కి చేరింది. ఇందులో 2,88,44,199 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. 3,88,135 మంది మహమ్మారి కారణంగా చనిపోయారు. 7,02,887 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ప్రొద్దున నుంచి ఇప్పటివరకు 1422 మంది చనిపోగా.. 78,190 …
Read More »తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుతో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో మంత్రివర్గం ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు.. ఈ భేటీలో లాక్డౌన్,వర్శపాతం,సాగు,కరోనా పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రేపటితో ఆదివారం నుండి లాక్డౌన్ ఎత్తివేయనున్నట్లు సమాచారం. ఈ అంశంపై సీఎం అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరగనుంది. లాక్డౌన్ను ఎత్తివేసి …
Read More »నటి కవిత ఇంట్లో విషాదం
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ సినిమా ఇండస్ట్రీని కూడా పీడిస్తోంది. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన సీనియర్ నటి కవిత ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె కుమారుడు సంజయ్ రూప్ కరోనాతో పోరుడుతూ తుది శ్వాస విడిచారు. మరో వైపు ఆమె భర్త సయితం కరోనాకు గురయ్యారు. ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కవిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. …
Read More »దేశంలో కొత్తగా 67,208 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 67,208 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరాయి. ఇందులో 2,84,91,670 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 3,81,903 మంది మరణించారు. మరో 8,26,740 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో 71 రోజుల తర్వాత యాక్టివ్ కేసులు కనిష్టస్థాయికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. నిన్న ఉదయం నుంచి …
Read More »