Home / INTERNATIONAL / డెల్టా వేరియంట్‌ ఎఫెక్ట్‌-సిడ్నీలో లాక్‌డౌన్‌

డెల్టా వేరియంట్‌ ఎఫెక్ట్‌-సిడ్నీలో లాక్‌డౌన్‌

కరోనా అత్యంత సమర్థవంతంగా కట్టడి చేసిన దేశాల్లో ఆస్ట్రేలియా ఒకటి. మరి అలాంటి దేశంలో కూడా డెల్టా వేరియంట్‌ దడపుట్టిస్తున్నది. ఆస్ట్రేలియాలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన సిడ్నీలో డెల్టా వేరియంట్‌ లక్షణాలున్న కరోనా కేసులు నమోదవుతున్నాయి.

దీంతో సెంట్రల్‌ సిడ్నీలోని పలు ప్రాంతాల్లో అధికారులు లాక్‌డౌన్‌ విధించారు. వైరస్‌ వ్యాప్తిని నిలువరించడానికి బాధితుని ఇంటి పక్కనున్న నాలుగు కుటుంబాలను వారం రోజులపాటు బయటకు రావద్దని అధికారులు సూచించారు.

అంతర్జాతీయ విమాన సిబ్బందిని సిడ్నీ ఎయిర్‌పోర్టు నుంచి క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తున్న క్రమంలో బస్సు డ్రైవర్‌కు కరోనా సోకింది. దీంతో గత వారంరోజుల్లోనే సిడ్నీలో డజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్‌ను కట్టడిచేయడానికి సిడ్నీలోని పలు ప్రాంతాల్లో లాక్‌ డౌన్‌ విధిస్తున్న ప్రకటించారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri