దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 5,335 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ప్రస్తుతం దేశంలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 25,587కి పెరిగింది. నిన్న 4,435 కరోనా కేసులు నమోదవగా.. ఇవాళ 900 కేసులు ఎక్కువగా నమోదవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.