దేశంలో కొత్తగా 9419 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,66,241కి చేరింది. ఇందులో 3,40,97,388 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,74,111 మంది మరణించగా, 94,742 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కాగా, గత 24 గంటల్లో 8251 మంది మహమ్మారి బారినుంచి బయటపడ్డారని, మరో 159 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,30,39,32,286 కరోనా డోసులు పంపిణీ చేశామని తెలిపింది. …
Read More »బ్రిటన్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయ తాండవం
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బ్రిటన్‌లో విలయం సృష్టిస్తున్నది. ఒకే రోజు 101 కొత్త కేసులు రికార్డయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 437కు చేరుకుందని బ్రిటిన్ ఆరోగ్య అధికారులు మంగళవారం తెలిపారు. డెల్టా వేరియంట్ కంటే కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కొవిడ్ పరిస్థితులపై మంత్రులతో సమీక్షించారు. వైరస్ కట్టడికి మరిన్ని …
Read More »దేశంలో కొత్తగా 8,439 కరోనా కేసులు
దేశంలో నిన్న భారీగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 8,439 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే 23శాతం ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 9,525 మంది కోలుకున్నారు. మహమ్మారి బారినపడి 195 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,56,822కు చేరింది. ఇందులో 3,40,89,137 …
Read More »ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదమా..?
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీలక అంశాన్ని వెల్లడించారు. గత వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ విధ్వంసకరమైంది ఏమీకాదన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమే అని, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందని, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా పనిచేస్తాయన్న దానిపై …
Read More »దక్షిణాఫ్రికాలో 700 రెట్లు వేగంగా ఒమిక్రాన్ కేసులు నమోదు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ భయాందోళనలు రేకెత్తిస్తున్నది. నవంబర్ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్‌లోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌లో కొత్త వేరియంట్ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ …
Read More »దేశంలో కనిష్ఠ స్థాయికి కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కొవిడ్ కేసులు రికార్డయ్యాయని పేర్కొన్నది. కొత్తగా 10,004 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,48,383కు పెరిగింది. ఇందులో …
Read More »కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా అనుమతివ్వండి
ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసు రూపంలో ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీరం సంస్థ భారత డ్రగ్ నియంత్రణ సంస్థ వద్ద దరఖాస్తు చేసుకున్నది. తమ కంపెనీకి చెందిన కోవీషీల్డ్ టీకాను బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని డీసీజీఐని కోరింది. తమ వద్ద కావాల్సినన్ని టీకాలు నిలువ ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా కరోనాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దడ …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మంది మరణించారు. మరో 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,00,543 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 123.25 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసుల పంపిణీ …
Read More »12దేశాల్లో రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్) మరికొన్ని దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు 12 దేశాల్లో ఈ కేసులను గుర్తించారు. సౌతాఫ్రికా, బోట్స్వానా, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, హాంగ్ కాంగ్, ఇటలీ, బెల్జియం, డెన్మార్క్, ఇజ్రాయెల్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ కేసులు వెలుగుచూశాయి. ఇప్పటికే చాలా దేశాలు ముందుజాగ్రత్తగా ఇతర దేశాల ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తున్నాయి.
Read More »Carona Vaccine కోసం పరుగులెడుతున్న జనాలు.. ఇందుకే..?
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న వారిలో చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. అయితే కరోనా కొత్త వేరియంట్ (ఒమిక్రాన్)పై ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలతో ప్రజలు రిస్క్ ఎందుకని టీకా కేంద్రాలకు పరిగెత్తుతున్నారు. గత 2 రోజులుగా రెండో డోసు తీసుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు.
Read More »