దేశంలో 7 వేల దిగువకు రోజువారీ కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,990 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 190 మంది మరణించారు.
మరో 10,116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,00,543 కేసులు యాక్టివ్గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 123.25 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసుల పంపిణీ జరిగింది.