Home / SLIDER / తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కేటీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి కేటీఆర్‌ దీపావళి శుభాకాంక్షలు

 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి పండుగ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకట్లను పారద్రోలి వెలుగులను నింపే పండుగగా దేశ ప్రజలు జరుపుకొంటున్న ఈ దీపావళి పండుగ మనందరి జీవితాల్లో ప్రగతి కాంతులు నింపాలని ఆకాంక్షించారు.

అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలన్నారు.‘దీపావళి పండుగ శుభసందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ.. మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ.. దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్ చేశారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat