Home / ANDHRAPRADESH / పవన్ కల్యాణ్‌ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!

పవన్ కల్యాణ్‌ని ఇందుకే చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అనేది..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని బాబుగారి దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటే జనసేన శ్రేణులు అంతెత్తున లేస్తారు..కానీ ఆ విమర్శల్లో నిజం ఉందని వారికి కూడా తెలుసు..పవన్ అడుగులన్నీ చంద్రబాబు చెప్పినట్లే ఉంటాయని ఎవరూ చెప్పక్కర్లేదు..గత 9 ఏళ్లుగా ఆయన రాజకీయ పయనం చూస్తే చిన్నపిల్లాడికి కూడా అర్థమవుతోంది. పార్టీ పెట్టిన రోజే కాంగ్రెసోళ్ల పంచెలూడకొడతానని రంకెలు వేసిన పవన్ కల్యాణ్…చంద్రబాబు పేరు ఎత్తగానే ఆయనంటే గౌరవం ఉంది అంటూ…చిరునవ్వులు నవ్వాడు..దీంతో అప్పుడే కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి చంద్రబాబు పథకంలో భాగంగా పుట్టిన పార్టీ..జనసేన అని డౌట్ వచ్చేసింది…

2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేసిన పవన్ చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడానికి తనవంతుగా సహకరించాడు..ప్రతిగా బాబుగారి నుంచి ప్యాకేజీ ముట్టిందో ఏమో తెలియదు కానీ…టీడీపీ హయాంలో అమరావతి పేరుతో జరిగే అక్రమాలను ఏనాడూ సరిగా ఖండించలేదు..పైగా జగన్ ప్రజా సమస్యలపై ఏదైనా పోరాటం చేసినప్పుడల్లా ..బాబుగారి ఆదేశాల మేరకు ..జనాల్లోకి రావడం…ఓ నాలుగు రోజులు హడావుడి చేసి ఇష్యూని డైవర్ట్ చేసి, మళ్లీ షూటింగ్ లకో..లేదో ఫామ్ హౌస్ కో వెళ్లిపోయేవాడు..దీంతో పవన్ చంద్రబాబు జేబులో మనిషి అని అందరికీ అర్థమైపోయింది.. అమరావతి ల్యాండ్ స్కామ్ పై కానీ, అగ్రిగోల్డ్ స్కామ్ కానీ, మహిళలపై అత్యాచారాల విషయంలో కానీ, జన్మభూమి కమిటీల అక్రమాలపై కానీ పవన్ నోరెత్తింది లేదు..పైగా అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించేది పోయి..నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ని పదే పదే టార్గెట్ చేసేవాడు..అప్పటి నుంచే పవన్ కల్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నేతల విమర్శలు మొదలయ్యాయి.

ఇక 2019 ఎన్నికల సమయంలో టీడీపీతో విబేధించిన పవన్ కల్యాణ్, కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు. పనిలో పనిగా బీఎస్పీ అధినేతను కూడా కలుపుకున్నాడు..అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు , జనసేన, వైసీపీల మధ్య చీలి..తాను గట్టెక్కుతానన్న చంద్రబాబు వ్యూహంలో భాగంగానే పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు తెంచుకుని కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశాడు..కానీ చంద్రబాబు, పవన్ ల పన్నాగాలు పసిగట్టిన ఏపీ ప్రజలు వైసీపీకి వన్ సైడ్ విక్టరీ అందించారు. ఆ తర్వాత వెంటనే బాబుగారి ఆదేశాల మేరకు కమ్యూనిస్టులను వదిలేసిన పవన్ కల్యాణ్…మళ్లీ బీజేపీతో కలిసిపోయాడు..దీని వెనుక ఎన్నికలకు ముందు మోదీతో సున్నం పెట్టుకుని సంకనాకిపోయిన దత్తతండ్రిని మళ్లీ బీజేపీ గూటికి చేర్చాలనే వ్యూహం ఉందని త్వరగానే అర్థమైంది..

గత నాలుగేళ్లుగా చంద్రబాబు సిట్ అండ్ సిట్..స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్లుగా ఉంది పవన్ కల్యాణ్ వ్యవహారం..తన సొంత పుత్రుడు నారా లోకేష్ ని నాయకుడిగా నిలబెట్టాలనే తాపత్రయంతో పాదయాత్ర మొదలెట్టించిన చంద్రబాబు పవన్ కల్యాణ్ వారాహియాత్ర రూట్ మ్యాప్ ని కూడా తానే డిసైడ్ చేస్తున్నట్లుగా ఉంది…లోకేష్ పాదయాత్రకు ప్రజల్లో పెద్దగా స్పందన రాలేదు…దీంతో బాబుగారి స్కెచ్ ప్రకారం రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలెట్టి జగన్ సర్కార్‌పై విరుచుకుపడ్డాడు..సహజంగానే సినీ నటుడు కావడంతో యువత వారాహి యాత్రకు పోటెత్తారు. పవన్ వీరావేశ ప్రసంగాలు, ఉద్రేకపు అరుపులు యువతను అట్రాక్ట్ చేశాయి. పవన్ వారాహియాత్రతో లోకేష్ పాదయాత్ర సోదిలో లేకుండా పోయింది..ఆఖరికి చంద్రబాబు అనుకుల మీడియాలో కూడా వపన్ కల్యాణ్ వారాహియాత్రకే ఎక్కువ ప్రచారం రావడంతో అసలుకే ఎసరు వస్తుందని భావించిన చంద్రబాబు వారాహియాత్రకు బ్రేక్ వేశాడు..బాబుగారి ఆదేశాలను శిరసావహించే పవన్ కల్యాణ్ మళ్లీ వారాహి వెహికల్ ను షెడ్టులో పెట్టేసి షూటింగ్ లకు వెళ్లిపోయాడు..దీంతో పచ్చమీడియాలో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లతో రోడ్ల మీద తిప్పుతా అంటూ వీరంగం వేస్తున్న లోకేష్ కు కవరేజ్ షురూ అయిపోయింది..

ప్రస్తుతానికి పవర్ స్టార్ కు అందిన ప్యాకేజీ ఓవర్ అయిందేమో లేదా..బాబుగారి నుంచి ఆదేశాలు వచ్చాయో కానీ ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి అయిన వారాహి గ్యారేజీకి వెళ్లిపోయింది..వారాహిని అధిరోహించి సింహనాదం చేసిన జనసేనాని ఇప్పుడు రెస్ట్ మోడ్ లో ఉన్నాడు..ఇకపై మళ్లీ ఛలో వారాహి అంటాడేమో అని జనసైనికులు వెయిట్ చేస్తున్నారు..కానీ మరో 3 నెలల వరకు అంటే ఈ డిసెంబర్ వరకు పవన్ కల్యాణ్ వారాహి యాత్రను రీ స్టార్ట్ చేసేడేలా లేడని సమాచారం..ఈలోపు లోకేష్ పాదయాత్ర కూడా క్లైమాక్స్ కు వస్తోంది..నిజానికి పవన్ కల్యాణ్ వైజాగ్ నుంచి ఉత్తరాంధ్రలో వారాహి యాత్ర చేపట్టాలి..కానీ వెస్ట్ గోదావరిలో రెస్ట్ లేకుండా వేస్ట్ పాదయాత్ర చేస్తున్న లోకేష్ ఈస్ట్ నుంచి ఉత్తరాంధ్రలోకి అడుగుపెడతాడు..దత్త తమ్ముడికి ఇబ్బంది లేకుండా…పవన్ ఇప్పుడు చేస్తున్న 3 సినిమాలకు కలిపి 3 నెలలు డేట్లు ఇచ్చేసినట్లు తెలుస్తోంది..డిసెంబర్ నాటికి లోకేష్ యాత్ర అయిపోతుంది..అప్పటి వరకు పచ్చమీడియాలో లోకేష్ కు జాకీలు వేసి లేపుతుంది..ఆ తర్వాత జనసేనాని జూలు విదిలించి వారాహిని అధిరోహించి కదనరంగంలోకి దూకుతున్నాడన్న మాట..

మొత్తంగా పవన్ కల్యాణ్ ని చంద్రబాబు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ఎందుకంటారో…ఇప్పటికైనా జనసైనికులకు అర్థం కాకపోతే…ఎవరేమి చేయలేరు..అవును..మా నాయకుడు చంద్రబాబు దత్తపుత్రుడు,  టీడీపీ ప్యాకేజీ స్టార్ అని అనుకుంటే ఎవరికి ఏం ఇబ్బంది లేదు..పైగా టీడీపీ, జనసేన పొత్తు ఖరారు అయిపోయినట్లే..ఇప్పుడు ఎవరేం అనుకున్నా..పవన్ ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యేదేం లేదు..వాళ్లకు అన్నీ తెలిసినా తెలియనట్లు నటిస్తుంటారు…ప్రస్తుతానికి ప్యాకేజీ ఓవర్..గ్యారేజీకి వారాహి వెళ్లిపోయినట్లే..దటీజ్ ప్యాకేజీ స్టార్..సారీ పవర్ స్టార్..!

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat