టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు , ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న సంగతి తెలిసిందే..కొడాలి నాని అడ్డా..గుడివాడ గడ్డపై అడుగుపెట్టిన నారాలోకేష్ తన తల్లిని అవమానించిన వారితో ఉచ్చపోయిస్తా, కట్ డ్రాయర్లపై రోడ్ల మీద తిప్పుతా అంటూ రెచ్చిపోయి డైలాగులు విసిరారు. అయితే లోకేష్ విమర్శలపై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నిజంగా నీ అబ్బ అయితే గుడివాడలో పోటీ చేయాలని, నువ్వు చంద్రబాబుకే పుట్టి ఉంటే గన్నవరంలో పోటీ చేయాలని పరుష పదజాలంతో లోకేష్ కు సవాల్ విసిరారు. తనతో ఉచ్చపోయిస్తా అన్న లోకేష్ డైలాగ్ కు కొడాలి నాని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. తన తల్లిని అవమానించినందుకు ప్రతికారంగా, లోకేష్ వచ్చి తన మూత్రం తీసుకువెళతాడంట అంటూ ఎద్దేవా చేశారు. అసలు 50 ఏళ్లు వచ్చిన తాను, లోకేష్ వచ్చి రోజూ మూత్రం పోయిస్తాడని ఎదురు చూడాలా అంటూ కౌంటర్ ఇచ్చారు.. పాదయాత్ర ఇచ్చాపురం వచ్చేసరికి లోకేష్ డైపర్ కూడా ఊడ కొట్టి, ప్రజలు తన్నే తన్నుకి కర్ణాటకలోనో, తమిళనాడులోనో పడతాడని కొడాలి నాని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు..
అలాగే కట్ డ్రాయర్లతో రోడ్డపై తిప్పుతానన్న లోకేష్ వ్యాఖ్యలపై కొడాలి నాని ఫైర్ అయ్యారు. . డైపర్ వేసుకొని కుప్పం నుండి పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్, తనను డ్రాయర్ పై నిలబెడతాడా అని కౌంటర్ ఇచ్చారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీలను అధికారంలోకి రాగానే లేపేద్దామంటూ లోకేష్ సమక్షంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. నన్ను వంశీని లేపేయడమంటే కొబ్బరి చిప్పలు సంచిలో వేసుకోవడం కాదని లోకేష్ బ్యాచ్ కు కౌంటర్ ఇచ్చారు. తాత, మామ, పెళ్ళాల పేర్లు చెప్పుకొని తిరిగే తండ్రీ కొడుకులు, మా సంగతి తెలుస్తారా అని చంద్రబాబు, లోకేష్ లను ప్రశ్నించారు. తమ పేర్లు రాసుకున్న ఎర్ర బుక్కులోని పేపర్లను ఎన్నికల అనంతరం తుప్పు నాయుడు, పప్పు నాయుడు వేరే దానికి ఉపయోగిస్తారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పప్పు నాయుడు చేసింది కమ్మగళం పాదయాత్రేనని విమర్శించారు.. కమ్మ దేవుడు చంద్రబాబు, యువరాజు లోకేష్ కోసం అర్ధరాత్రి వరకు డకోటా బ్యాచ్ రోడ్లపై తిరిగారని కొడాలి తెలిపారు. మొత్తంగా లోకేష్ ఉచ్చపోయిస్తా డైలాగులకు మాజీ మంత్రి కొడాలి నాని తనదైన స్టైల్లో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.