Home / ANDHRAPRADESH / చంద్రబాబు జైల్లో ఉన్నా పట్టించుకోని జూ. ఎన్టీఆర్..ఇక టీడీపీ భవిష్యత్ దబిడిదిబిడే..!

చంద్రబాబు జైల్లో ఉన్నా పట్టించుకోని జూ. ఎన్టీఆర్..ఇక టీడీపీ భవిష్యత్ దబిడిదిబిడే..!

ఇన్నాళ్లు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని దాదాపు 26 కేసుల్లో ఒక్క దానిలో కూడా విచారణ ఎదుర్కోకుండా..స్టేలు తెచ్చుకుని తెలివిగా తప్పించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎట్టకేలకు స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికి జైలు పాలయ్యారు..చంద్రబాబు అరెస్ట్ తో ఏదో ‎తెలుగు దేశం నేతలకు, పచ్చ మీడియా కంటిమీద కునుకు లేకుండా పోయింది..3 రోజులుగా ఎవరో పెద్దాయన పోయినట్లుగా సంతాపదినాలు పాటిస్తున్నట్లుగా శోకాలు పెడుతున్నాయి పచ్చ మీడియా డబ్బాలు..చంద్రబాబు లాంటి నిప్పు నాయుడు జైలుకు వెళితే..ప్రజలతో సహా ఎవరూ స్పందించడం లేదే…ఆఖరికి టీడీపీ కార్యకర్తలు కూడా రోడ్ల వచ్చి విధ్వంసాలు చేయకుండా ఇంట్లో బిర్యానీలు తినుకుంటూ టీవీ ఛానళ్ల బాబోరు జైలుకు వెళుతున్న విజువల్స్ చూస్తూ జల్సా చేస్తున్నారని పచ్చ మీడియా ఛానళ్లు వాపోతున్నాయి..అయ్యో మా కులదైవాన్ని బయటకు తీసుకువచ్చే మార్గం ఏంటని పచ్చ మీడియా చేయని జిమ్మిక్కులు లేవు..ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ‍యనతో పనులు చేయించుకున్న సినిమా పెద్దలకు కూడా బాబోరు జైలు పాలైతే కనీసం ఒక్క ట్వీట్ వేసే మనసు కూడా రాలేదే..టాలీవుడ్ సినిమా స్టార్స్ పై ఆక్రోశాన్ని వెళ్లగక్కుతుంది.

ఏదో బామ్మర్ది, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే కాబట్టి బాలయ్య కాస్త హడావుడి చేశారు..టీడీపీకి నేనున్నా..పార్టీని నడిపించడానికి అప్పుడు. ఇప్పుడు మా కుటుంబం ఉందంటూ బాలయ్య కొట్టిన డైలాగులకు నారా బ్యాచ్ లో వణుకు మొదలైంది..తండ్రికి వెన్నుపోటును గుర్తుపెట్టుకుని టైమ్ చూసి బాలయ్య బాబోరికి వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని లాక్కోరు కదా అని నారా బ్యాచ్ బాలయ్యని అనుమానంగా చూస్తోంది..ఇక బాబోరు అరెస్ట్ అయిన దగ్గర నుంచి అసలు సొంత పుత్రుడి కంటే దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ ఆక్రందనలు చూసి టాలీవుడ్ జనాలకే కాదు..ఆఖరికి టీడీపీ జనాలకు కూడా డౌట్లు వచ్చేస్తున్నాయి..పాపం అన్యాయంగా మా దత్త తండ్రి…పెద్దాయని పట్టుకుని జైల్లో పెట్టారు..ఇక సామాన్యుడి గతేంటీ అని పవన్ కల్యాణ్ రంకెలు వేస్తున్నారు.

కానీ నందమూరి వారసుడు జూ. ఎన్టీఆర్ మాత్రం తన మామ చంద్రబాబు సెంట్రల్ జైల్లో నానాతిప్పలు పడుతుంటే..కనీసం ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడంపై టీడీపీ జనాలు..ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్, నారా వర్గం గుర్రుగా ఉంది..2009 ఎన్నికలప్పుడు వైఎస్ హవాలో మళ్లీ ఓడిపోతానని గ్రహించిన చంద్రబాబు జూ. ఎన్టీఆర్‌ని ఉమ్మడి రాష్ట్రమంతా ప్రచారానికి తిప్పి వాడుకున్నారు. ఆ తర్వాత వాగ్ధాటిలో, నాయకత్వపటిమలో, జనాకర్షణలో తిరుగులేని ఎన్టీఆర్ ఎక్కడ భవిష్యత్తులో తన కొడుకు లోకేష్ సీఎం పదవికి అడ్డుపడతాడో అని భయపడిన చంద్రబాబు కరివేపాకులా జూ. ఎన్టీఆర్ ని తీసిపడేశారు. అంతే కాదు..జూ. ఎన్టీఆర్ సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్లు ఇవ్వకుండా…సతాయించారు..సినిమా మొదటి ఆటకే…బాలయ్య అభిమానులు , టీడీపీ నేతలు ఫ్లాప్ అంటూ నెగెటివ్ ప్రచారం చేశారు. జూ. ఎన్టీఆర్ దమ్ము, శక్తి సినిమాలు ఫ్లాప్ చేయడంలో టీడీపీ శ్రేణులు ఎంతగా శ్రమించాయో అందరికీ తెలిసిందే..

ఇక తన అల్లుడి కోసం బాలయ్య కూడా తన అన్న కొడుకు..తమ వంశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటిన జూ. ఎన్టీఆర్ ని ఇప్పటికీ అవమానిస్తూనే ఉన్నాడు…ఇవన్నీ మనసులో పెట్టుకున్న జూ. ఎన్టీఆర్ ఏ నాటికైనా తను రాజకీయాల్లోకి వస్తే టీడీపీ పార్టీ నారా చేతిలోంచి తన చేతిలోకి వస్తుందని తెలుసు…అందుకే సైలెంట్‌గా సినిమాలు చేసుకుంటున్నాడు..నారా భువనేశ్వరీని తన సన్నిహితులు అవమానించినప్పుడు ఎవరినీ నొప్పించక సుతిమెత్తగా ఆడవాళ్లకి గౌరవం ఇవ్వాలని హితవు పలికిన ఎన్టీఆర్…ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చినప్పుడు కూడా ఎన్టీఆర్, వైఎస్ఆర్ వంటి మహానేతల విషయంలో రాజకీయాలు చూడొద్దు..పేరు మార్చినంత మాత్రానా వారి గౌరవం తగ్గదు అంటూ తన విజ్ఞతను ప్రదర్శించాడు..

ఇప్పుడు తన మామ చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన జైలుకు వెళ్లినప్పుడు జూ. ఎన్టీఆర్ స్పందించలేదని టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు..అసలు చంద్రబాబు నిప్పు అయితే స్పందించేవాడు..కానీ తన మామ అవినీతి తుప్పు అని ఎన్టీఆర్ కు కూడా తెలుసు..అందుకే సైలెంట్‌గా ఉన్నాడు..తాజాగా కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చంద్ర‌బాబు అరెస్టును జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌నీసం ఖండించ‌ట్లేదు. దీన్ని బ‌ట్టి టీడీపీ భ‌విష్య‌త్ ద‌బిడి దిబిడే అని సృష్టంగా తెలుస్తోంది.. అంటూ ట్వీట్ చేశారు. . కాగా చంద్ర‌బాబు అరెస్ట్ అయిన‌ప్పటి నుండి నంద‌మూరి కుటుంబ స‌భ్యులు అంద‌రు ఆయ‌న అరెస్ట్‌ను ఖండిస్తున్నా జూ. ఎన్టీఆర్, క‌ళ్యాణ్ రామ్ నుండి ఎటువంటి స్పంద‌న రావ‌డం లేదు.దీంతో చంద్రబాబు సామాజిక వర్గ టీడీపీ నేతలు ఎన్టీఆర్‌తో పాటు టాలీవుడ్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా చంద్ర బాబు జైల్లో ఉన్నా పట్టించుకోని జూ. ఎన్టీఆర్ ఇక టీడీపీ భవిష్యత్తు దబిడిదిబిడే అంటూ బాలయ్యను వెటకరిస్తూ రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సినీ, రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat