దేశవ్యాప్తంగా కరోనా వైర్‌సతో ఇప్పటిదాకా 66,333 మంది మృతిచెందారు. మృతుల్లో 51శాతం మంది అరవై ఏళ్లు, ఆపైన వయసు గల వారేనని కేంద్రం పేర్కొంది. మృతుల్లో 18-25ఏళ్లలోపు వారు ఒకశాతం, 26-44 ఏళ్లలోపు వారు 11శాతం, 45-60 ఏళ్లలోపు వారు 36శాతం ఉన్నారని వెల్లడిచింది. మృతుల్లో 69శాతం పురుషులే ఉన్నారని పేర్కొంది. పాజిటివ్ కేసుల్లో 54శాతం మంది 18-44 ఏళ్లలోపువారేనని వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటులో మరింత తగ్గుదల …
Read More »తెలంగాణ ఏర్పాటులో ప్రణబ్ కీలక పాత్ర
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం ప్రకటించారు. భారతదేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందన్నారు. 1991లో ఎంపీగా ఉన్న సమయం నుంచి తనకు ప్రణబ్ ముఖర్జీతో అనుబంధం ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రణబ్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. యావత్ తెలంగాణ సమాజం ప్రణబ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
Read More »దేశంలో 36 లక్షలు దాటిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తోంది. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది కరోనా బారిన పడగా, ఈ రోజు కూడా అంతే సంఖ్యలో పాజటివ్ కేసులు వచ్చాయి. దీంతో ప్రపంచంలో రోజువారీగా అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. దేశంలో గత 24 గంటల్లో 78,512 కరోనా కేసులు కొత్తగా నమోదవగా, 971 మంది …
Read More »భారత్‌లో ఒక్కరోజే 69వేల కేసులు
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల …
Read More »మళ్లీ ఆసుపత్రిలో చేరిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …
Read More »మేఘాలయగా గవర్నర్‌గా సత్యపాల్ మాలిక్
గోవా గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ ఆయనను మేఘాలయ గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇంతకు ముందు ఆయన జమ్మూకశ్మీర్, బీహార్ గవర్నర్‌గా పని చేశారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారికి గోవా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. 2018 ఆగస్టులో ఆయన జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతేడాది ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా …
Read More »ప్రతి ఒక్కరికి హెల్త్ కార్డు
74వ స్వాంతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట వేదికగా ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. ఈ రోజు ఆయన నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్(ఎన్‌డీహెచ్‌ఎం)ను ప్రారంభించారు. దీని కింద ప్రతి భారతీయుడికి ఒక ఐడీ నంబర్‌ను కేటాయించనున్నారు. పూర్తిగా టెక్నాలజీ ఆధారితమైన ఈ మిషన్ వైద్యరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి భారతీయుడి సమగ్ర వైద్యసమాచారం ఆ ఐడీ ద్వారా …
Read More »భారత్‌లో 25 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 50 వేలకు చేరువగా మరణాల సంఖ్య చేరుకుంది. ప్రతిరోజు దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 996 …
Read More »అంబానీ సంచలన నిర్ణయం
ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …
Read More »మరో కేంద్ర మంత్రికి కరోనా
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంత్రులు, రాజకీయ నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకగా, తాజాగా ఆయూష్ కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించిన ఆయన. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Read More »