దేశవ్యాప్తంగా కరోనా వైర్‌సతో ఇప్పటిదాకా 66,333 మంది మృతిచెందారు. మృతుల్లో 51శాతం మంది అరవై ఏళ్లు, ఆపైన వయసు గల వారేనని కేంద్రం పేర్కొంది. మృతుల్లో 18-25ఏళ్లలోపు వారు ఒకశాతం, 26-44 ఏళ్లలోపు వారు 11శాతం, 45-60 ఏళ్లలోపు వారు 36శాతం ఉన్నారని వెల్లడిచింది. మృతుల్లో 69శాతం పురుషులే ఉన్నారని పేర్కొంది.
పాజిటివ్ కేసుల్లో 54శాతం మంది 18-44 ఏళ్లలోపువారేనని వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటులో మరింత తగ్గుదల నమోదైంది. బుధవారం నాటికి మరణాల శాతం 1.76గా ఉంది. ఈ విషయంలో ప్రపంచ సగటు 3.3 శాతంతో పోల్చితే మన దేశం ఎంతో మెరుగ్గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది లక్షల జనాభాకు 110 కరోనా మరణాలు సంభవిస్తుంటే భారత్‌లో ఈ సగటు 48గా ఉంది. భారత్‌తో పోల్చితే బ్రెజిల్ 12 రెట్లు, బ్రిటన్‌లో 13 రెట్లు ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశంలో కరోనా కేసులు 37లక్షలు దాటాయి. బుధవారం కొత్తగా 78,357 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 37,69,523కు చేరింది. వీరిలో ఇప్పటిదాకా 29,01,908 మంది కోలుకున్నారు.
యాక్టివ్ కేసులు 8,01,282 ఉ న్నాయి. వైర్‌సతో చికిత్స పొందుతున్నవారిలో గత 24 గంటల్లో 1045 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో 320, కర్ణాటకలో 135, తమిళనాడు 96, ఆంధ్రప్రదేశ్‌లో 84, పంజాబ్‌లో 59, యూపీలో 56, పశ్చిమ బెంగాల్‌లో 55, బిహార్‌లో 39, మధ్యప్రదేశ్‌లో 32, ఢిల్లీలో 18, హరియాణాలో 17, గోవా, జమ్మూ కశ్మీర్‌లో 14 చొప్పున, రాజస్థాన్‌లో 13, పాండిచ్చేరిలో 12, జార్ఖండ్, ఒడిసా, ఉత్తరాఖండ్‌లో 11 చొప్పున, ఛత్తీ్‌సగఢ్, తెలంగాణలో 10చొప్పున, అసోంలో 9, త్రిపురలో 5, కేరళలో 4, హిమాచల్ ప్రదేశ్, గోవా, మేఘాలయాలో 2చొప్పున చండీగఢ్, మణిపూర్, లద్దాఖ్, సిక్కింలలో ఒకటి చొప్పున మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కొవిడ్-19 మరణాల సంఖ్య 66,333కు చేరుకుంది. అత్యధికంగా మహారాష్ట్రలో 24,903 మంది మృతిచెందారు.
కొవిడ్ మృతుల్లో 70శాతం ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారే ఉన్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఐసీఎంఆర్ డాటా ప్రకారం సెప్టెంబరు 1వ తేదీ నాటికి 4,43,37,201 పరీక్షలు నిర్వహించారు.