ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని నరేంద్ర మోడీ గతంలో హామీ ఇచ్చారని.. అది ఏమైందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 1.32లక్షల జాబ్స్ భర్తీ చేసిందని.. త్వరలో మరో లక్ష చేస్తుందని చెప్పారు. ప్రైవేట్ …
Read More »చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: పెద్దిరెడ్డి
కుప్పంలో మైనింగ్ మాఫియా జరుగుతోందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. కేవలం ఎన్నికల అస్త్రంగా ఉపయోగపడుతుందనే ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. మంత్రుల బస్సు యాత్ర సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన సామాజిక భేరి ముగింపు సభ విజయవంతమైందని ఆయన చెప్పారు. 2024లో జరిగే ఎన్నికలే చంద్రబాబుకు చివరివని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయభేరి ముగింపు …
Read More »వైసీపీ మంత్రుల బస్సుయాత్రకు ప్రజల బ్రహ్మరథం
వైసీపీ మంత్రులు చేపట్టిన ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. గురువారం ఉదయం శ్రీకాకుళంలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకుంది. దారి పొడవునా యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగుడుగనా నీరాజనాలు పలుకుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని మంత్రులు ఈ యాత్రలో వివరిస్తున్నారు. విజయనగరంలోని న్యూపూర్ణ జంక్షన్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. …
Read More »రెండు మూడు నెలల్లోనే సంచలన వార్త వింటారు: కేసీఆర్
కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశంలో ఎవరూ సంతోషంగా లేరని టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికే సాగునీరు, తాగునీరు, విద్యుత్ కోసం ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. బెంగళూరులో జనతాదళ్ (ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామితో ఆయన భేటీ అయ్యారు. వారి నివాసంలో మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత వివిధ …
Read More »వెనకుండి రెచ్చగొట్టడం కాదు.. మీడియా ముందుకు రండి: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్
పచ్చని కోనసీమలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అశాంతిని రేకెత్తించాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కోనసీమకు డా బీఆర్ అంబేడ్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేడ్కర్ జిల్లా పేరు పెడతామని చెప్పారని సుభాష్‌చంద్రబోస్ గుర్తుచేశారు. బయట ఒకలా..లోపల మరోలా చెప్పొద్దని.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలన్నారు. వెనుకనే ఉండి రెచ్చగొట్టడం సరికాదని ఆగ్రహం …
Read More »టీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీగా వద్దిరాజు రవిచంద్ర ఎన్నిక ఏకగ్రీవం
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. బండ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రవిచంద్రను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాజ్యసభ స్థానం గెలుపొందేందుకు పూర్తిస్థాయిలో మెజార్టీ టీఆర్‌ఎస్ పార్టీకి ఉంది. దీంతో మిగతా పార్టీలు అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈ నేపథ్యంలో వద్దిరాజు రవిచంద్ర ఒక్కరే నామినేషన్ వేయడంతో …
Read More »కేంద్రంలో హిట్లర్ కంటే దారుణంగా బీజేపీ పాలన: మమత
కేంద్రంలోని బీజేపీ పాలన హిట్లర్, ముస్సోలిని కంటే దారుణంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో రాష్ట్రంలోని పాలనా వ్యవహారాల్లో బీజేపీ ప్రభుత్వం తలదూరుస్తోందని ఆరోపించారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థలను కూల్చివేస్తోందన్నారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా దర్యాప్తు సంస్థలు పనిచేసేలా స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆమె కోరారు.
Read More »దళిత వ్యక్తి నమిలిన ఆహారాన్ని తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే!
కులవివక్షకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వింత ప్రయత్నం చేశారు. దళిత పూజారి స్వామి నారాయణ్ నమిలిన ఆహారాన్ని ఆయన తిని అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ఘటన కర్ణాటకలోని చామరాజపేటలో చోటుచేసుకుంది. అక్కడ నిర్వహించిన అంబేడ్కర్ జయంతి, ఈద్ మిలాన్ ఉత్సవాల్లో స్వామి నారాయణ్‌కు ఎమ్మెల్యే జమీర్‌ఖాన్ తన చేతితో ఆహారం తినిపించారు. ఆ తర్వాత స్వామి నారాయణ్ ఎమ్మెల్యేకు ఆహారం తినిపించబోతే …
Read More »తీన్మార్ మల్లన్నకు మంత్రి పువ్వాడ అజయ్ షాక్!
తీన్మార్ మల్లన్నకు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ షాక్ ఇచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ మల్లన్నకు న్యాయవాదితో మంత్రి లీగల్ నోటీసు పంపించారు. ఏప్రిల్ 17న మల్లన్న తన యూట్యూబ్ ఛానల్‌లో మంత్రి అజయ్‌పై అసత్య ఆరోపణలు చేశారని ఆయన తరఫు లాయర్ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు. మంత్రి పరువుకు భంగం కలిగించినందున వారంలోపు బహిరంగ క్షమాపణలు చెప్పాలని మంత్రి తరఫున న్యాయవాది మల్లన్నను డిమాండ చేశారు. అంతేకాకుండా …
Read More »బండి సంజయ్‌పై కేటీఆర్ పరువునష్టం దావా!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన లాయర్ ద్వారా కేటీఆర్ నోటీసుల పంపారు. కావాలనే బండి సంజయ్ అబద్ధాలు చెబుతున్నారని.. ఇంటర్ విద్యార్థుల సూసైడ్ ఘటనలను కేటీఆర్‌కు ఆపాదిస్తున్నారని ఆయన తరఫు లాయర్ నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకే నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు. 48 గంటల్లో కేటీఆర్‌కు సారీ చెప్పాలని.. లేకపోతే క్రిమినల్, సివిల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌కు పరిహారం ఇవ్వాల్సి …
Read More »