తెలంగాణ పెట్టుబడుల ఆకర్షణలో దూసుకెళ్తాందని MSME ఎక్స్ ఫోర్ట్ కౌన్సిల్, బిల్ మార్ట్ ఫిస్టాక్ సంయుక్త అధ్యయనంలో తేలింది. 2014లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నూతన పారిశ్రామిక విధానం, టీఎస్ ఐపాస్ అమలుతో ఏడేళ్లలో రాష్ట్రానికి రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. వీటి వల్ల ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని తెలిపింది. 2021-22లో తెలంగాణ రూ. 11,964 కోట్ల విలువైన …
Read More »బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఏమి తినాలి అంటే..?
బ్రేక్ ఫాస్ట్ సమయంలో మొలకెత్తిన శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ జీర్ణ ప్రక్రియకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ పెరుగుతుంది.
Read More »ఆసీస్ పై శ్రీలంక ఘన విజయం
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. వర్షం పడటంతో శ్రీలంక 47.4 ఓవర్లలో 220/9 రన్స్ చేసింది. DLS ప్రకారం రెండో ఇన్నింగ్స్ ను 43 ఓవర్లకు కుదించారు. 216 పరుగులను లక్ష్యంగా పెట్టారు. అయితే శ్రీలంక బౌలర్లు రాణించడంతో ఆస్ట్రేలియా 37.1 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా మొదటి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. మరో 3 వన్డేలు మిగిలి ఉన్నాయి.
Read More »జియో రికార్డు
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ జియో..జియో తమ సంస్థకు చెందిన నెట్ వర్క్ యూజర్ల సంఖ్యను మరింత పెంచుకుంది. ట్రాయ్ డేటా ప్రకారం ఏప్రిల్లో జియోలోకి కొత్తగా 16.8 లక్షల మంది యూజర్లు వచ్చారు. రెండో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా నుంచి 15.7 లక్షల మంది వెళ్లిపోయారు. మరోవైపు ఎయిర్ టెల్ నెట్ వర్క్ లో తాజాగా కొత్తగా 8.1 లక్షల మంది చేరారు. ప్రస్తుతం జియోకు …
Read More »స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు
క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టెఫన్ నీరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కామన్ వెల్త్ బ్యాంక్ అంధుల క్రికెట్ సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ బ్యాటర్ స్టెఫన్ నీరో కేవలం 140 బంతుల్లో 309 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. నీరో 49 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. దీంతో ఆసీస్ 542 పరుగుల భారీ స్కోర్ చేయగా కివీస్ 272 …
Read More »జేసీ బ్రదర్స్ కు ఈడీ షాక్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన సీనియర్ నేత.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి,మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి లకు ఈడీ షాకిచ్చింది. ఈరోజు శుక్రవారం ఉదయం నాలుగంటల నుండి ఇంట్లో ఈడీ తనిఖీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు ప్రభాకర్ రెడ్డి, ఆయన కుటుంబసభ్యుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఇంటి లోపలికి రానీయకుండా …
Read More »పాలేరు నుండి బరిలోకి వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో YSRTP అధ్యక్షురాలు షర్మిల ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈనెల 19న నేలకొండపల్లిలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజికవర్గం బలంగా ఉంది. దివంగత నేత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఈ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండటంతో వైఎస్ షర్మిల పాలేరుపై ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.
Read More »దేశంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త
రానున్న సంవత్సరకాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 1,48,463 నియామకాలను పూర్తి చేస్తామని రైల్వే శాఖ తెలిపింది. గత ఎనిమిదేళ్లలో ఏడాదికి సగటున 43,678 కొత్తగా ఉద్యోగాలిస్తున్నామని వెల్లడించింది. 2014-15 నుంచి 2021-22 వరకు మొత్తం 3,49,422 మందికి ఉద్యోగాలిచ్చామ్ము. 2022-23లో మరో 1,48,463 నియామకాలు చేపడతామని స్పష్టం చేసింది. మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్ సి, డి పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
Read More »ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. తమ భూములను అక్రమంగా లాక్కున్నారని కొందరు మహిళలు ఎమ్మెల్యే కండువాను లాగేశారు. ప్రజాప్రతినిధులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఉద్రిక్తత చోటుచేసుకునే అవకాశం ఉండటంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తప్పుడు రికార్డులు సృష్టించి తమ ఐదెకరాల భూమిని ఎమ్మెల్యే కబ్జా. మహిళలు ఆరోపిస్తున్నారు.
Read More »ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ వద్ద ఓ మినీ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా యూపీ పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 26 మంది ఓ మినీ బస్సులో అయోధ్య, కాశీ సందర్శనకు ఈ నెల 10న …
Read More »