Home / Tag Archives: slider (page 39)

Tag Archives: slider

కరోనా ఎఫెక్ట్ – మందుబాబులకు వార్నింగ్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవాళ్లపై కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు ఎక్కువగా ఉంటోందన్నారు. మద్యపానం సేవించేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్, CII ఆధ్వర్యంలో జరిగిన వెబినార్లో ఈ విషయం …

Read More »

తెలంగాణలోని పల్లెల్లో కరోనా విజృంభణ

తెలంగాణలోని పల్లెల్లో సరైన చికిత్స అందకపోవడం, కిట్ల కొరతతో టెస్టులు జరగకపోవడంతో కరోనా తీవ్రతరం అవుతోంది. ప్రాణాలూ కోల్పోతున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో నెలరోజుల్లో 20 మంది మరణించగా, 200 మందికి పైగా కరోనా సోకింది. నిర్మల్ జిల్లా కడెం మండలం పాతమద్దిపడగలో 20 రోజుల్లో 10 మంది కరోనాకు బలయ్యారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారంలో ఇటీవల 150 మందికి కరోనా సోకగా, ఏడుగురు మరణించారు.

Read More »

సోనూసూద్ కి మద్ధతుగా హీరోయిన్

కరోనా విపత్తు వేళ సాయం చేసేందుకు బాలీవుడ్లో పాటు ఇతర ప్రముఖులు ముందుకు వస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో నటుడు సోనూసూద్ అందరికంటే ముందుంటున్నారు. కాగా, యువ నటీమణి, సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్.. సోనూసూద్కు మద్దతుగా నిలిచారు. సోనూసూద్ ఫౌండేషన్కు విరాళమందించారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విటర్ వేదికగా వెల్లడించి సారాకు ధన్యవాదాలు తెలిపారు.

Read More »

ఆక్సిజన్ సిలిండర్లను అందించడానికి మేఘా ముందుకు

కరోనా సెకెండ్ వేవ్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో రోగులకు ఆక్సిజన్ అత్యవసరంగా మారింది. దాంతో సహజంగానే ఆక్సిజన్ సిలిండర్లకు డిమాండ్ పెరిగిపోయింది. ఉత్పత్తి సరైన స్థాయిలో లేకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా అవసరమైన మేరకు జరగడం లేదు. ఈ ప‌రిస్థితుల్లో హైద‌రాబాద్‌లోని ప్ర‌ఖ్యాత నిమ్స్‌, అపోలో, స‌రోజినిదేవి వంటి ఆస్ప‌త్రుల నుంచి మేఘా ఇంజినీరింగ్ సంస్థ‌కు ఆక్సిజ‌న్ అందించ‌మ‌ని అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి.. వ‌చ్చిందే త‌డ‌వుగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ల‌ను …

Read More »

తమిళనాడులో లాక్డౌన్

ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …

Read More »

పుట్ట మధు అరెస్ట్

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే,ప్రస్తుతం పెద్దపల్లి జడ్పీఛైర్మన్ పుట్టా మధును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీలోని భీమవరంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈటల రాజేందర్ ఎపిసోడ్ నుంచి పుట్టా మధు కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన సతీమణి.. కొవిడ్ నుంచి కోలుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మధు అరెస్ట్ అయ్యారు. ఆయనను ఏ కేసులో అరెస్ట్ చేశారనేది పోలీసులు …

Read More »

కంగనా రనౌత్ కి కరోనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించగా పాజిటివ్ వచ్చింది. క్వారంటైన్లో ఉన్నాను. ఈ వైరస్కు నా శరీరంలో చోటు లేదు. దాన్ని నాశనం చేస్తాను. మీరు దానికి భయపడితే అది మిమ్మల్ని భయపెడుతుంది. హర్ హర్ మహాదేవ్’ అంటూ పేర్కొంది.

Read More »

లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో ప్రభాస్ మూవీ

‘ఆకాశమే నీ హద్దురా’ ఫేం లేడీ డైరెక్టర్ సుధా కొంగర… డార్లింగ్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా సుధా.. ప్రభాస్కు ఒక సోషల్ డ్రామా కథ చెప్పారట. స్టోరీ లైన్కు ప్రభాస్ ఇంప్రెస్ అయ్యాడు.. బౌండ్ స్క్రిప్ట్ విన్న తరువాత సుధా ప్రాజెక్ట్ పై తుది నిర్ణయం తీసుకుంటాడని తెలుస్తోంది. అయితే, ప్రభాస్ 2023 వరకు ఇప్పటికే ఓకే చెప్పిన పాన్ ఇండియా ప్రాజెక్టులతో …

Read More »

తెలంగాణలో రెండు వారాల్లోనే లక్షకు పైగా కేసులు

తెలంగాణలో కరోనా చాలా వేగంగా వ్యాపిస్తోంది.రాష్ట్రంలో గడచిన రెండు వారాల్లోనే లక్షకుపైగా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా టెస్టుల నిర్వహణ మరో పెద్ద సమస్యగా మారింది. టెస్టులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. కిట్ల కొరతే ఇందుకు కారణమని వైద్య, ఆరోగ్య శాఖ చెబుతోంది. దీంతో లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోలేకపోతున్నారు. టెస్ట్ జరగకపోవడంతో అందరితో కలిసి ఉంటున్నారు.. దీంతో వైరస్ ఇతరులకు వ్యాపిస్తోంది.

Read More »

18ఏళ్ల పైబడినవారికి ఎప్పుడంటే టీకా.?

తెలంగాణలో కొవిడ్ టీకాలలో రెండో డోసు మాత్రమే ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. 18ఏళ్లు దాటినవారు మరికొన్ని రోజులు ఆగాల్సివస్తోంది. ఈ నెల 15 వరకు స్లాట్ బుకింగ్ ఉండదని, తర్వాత పరిస్థితుల్ని బట్టీ నిర్ణయిస్తామని వైద్యారోగ్యశాఖ చెప్పింది. ఆర్డర్ చేసినన్ని డోసులు వస్తే 18ఏళ్ల వారికి టీకాలు ఇవ్వనున్నారు. ఇక నేటి నుంచి రెండో డోసు కోసం స్లాట్ బుకింగ్తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లవచ్చు.

Read More »