కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డ్ నెంబర్ 1 బాచుపల్లి డివిజన్ ప్రగతి అంటిల్ల లో ఈరోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు,డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారు,కమిషనర్ రామకృష్ణ రావు గారు,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి గారు,స్థానిక డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు,గౌరవ ప్రజాప్రతినిధులతో కలిసి వరద ముంపు ప్రాంతాలు పర్యటించారు.
అలాగే తన అనుచరుల ద్వారా బచుపల్లి లోని ప్రణీత్ ప్రణవ్ ఆంటీల లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రహరీ గోడ కూలే స్థితిలో ఉన్నందనీ తెలుసుకొని వెంటనే అధికారులను అప్రమత్తం చేసి వారితో ఆ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులు సమీక్షించి ఎటు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు,
అలాగే కార్పొరేషన్ పరిధిలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణ సముదాయాలు గుర్తించి తగు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా NMC అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళా నాయకులు,NMC అధికారులు, బాచుపల్లి సిఐ సుమన్,పోలీస్ సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.