దేశంలో గత 24 గంటల్లో 9,69,354 కరోనా టెస్టులు చేయగా 8,318 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న కరోనాతో 465 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,67,933 మంది కరోనా కాటుకు బలయ్యారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,019గా ఉండగా, గత 24 గంటల్లో 10,967 మంది రికవరీ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు 121.06 కోట్ల టీకా డోసులు ఇచ్చారు.
Read More »WIPRO కు 21 మంది SBIT విద్యార్థుల ఎంపిక
ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన WIPRO కంపెనీ ఆన్లైన్ ప్రాంగణ నియామకాలు నిర్వహించిందని, దీనిలో స్థానిక SBIT ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ జి. కృష్ణ తెలియచేసారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారని, ఎంపికైన 21 మందిలో CSE విభాగం నుండి 13 మంది. ECE నుండి 7గురు, Mechanical నుండి ఒక్కరు ఉద్యోగాలు సాధించారని …
Read More »క్షీరసాగర్ లో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
ప్రజా ప్రయోజనార్థం గ్రామ ప్రజలకు ఉచిత మినరల్ వాటర్ అందించాలనే లక్ష్యంతో ఏంపీటీసీ కొన్యాల మమత బాల్ రెడ్డి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.సిద్ధిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్ గ్రామంలో గురువారం ఉదయం కొన్యాల బాల్ రెడ్డి తండ్రి నారాయణరెడ్డి జ్ఞాపకార్థం, కేబీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ అండ్ కూల్ వాటర్ ప్లాంట్ …
Read More »శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమం
ప్రముఖ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమించింది. కరోనాతో హైదరాబాద్ లోని AIG ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. 75% ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు వైద్యులు తెలిపారు. శివశంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకి అపస్మారక స్థితిలో ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. కాగా ఆసుపత్రి బిల్లులు చాలా ఎక్కువయ్యాయని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా చిన్న కుమారుడు అజయ్ కోరుతున్నారు
Read More »రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి
రాజస్థాన్లో ఇటీవల కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర సింగ్ గుదా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలన్న ఆయన కామెంట్లపై విమర్శలు వస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం ఉదయపూర్వతిలో ఆయన పర్యటించగా.. రోడ్లను బాగుచేయాలని ప్రజలు మంత్రిని కోరారు. దీంతో అధికారులతో సమావేశమైన మంత్రి.. తన నియోజకవర్గంలోని రోడ్లు కత్రినా బుగ్గల్లా మెరవాలని ఆదేశించారు.
Read More »అమ్మవారి అవతారంలో మిల్క్ బ్యూటీ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అందాల రాక్షసి ..మిల్కీ బ్యూటీ తమన్నా అమ్మవారి అవతారంలో దర్శనమిచ్చి ఫ్యాన్స్ను సరైజ్ చేసింది. ఆ గెటప్తో అరటి ఆకులో భోజనం చేస్తున్న ఫొటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. ‘అరటి ఆకులో తింటుంటే నాకు దేవతననే ఫీలింగ్ కలుగుతోంది. ఈ ఆకులు మనకు సులభంగా లభిస్తాయి. వీటిలో తినడం పర్యావరణానికి ఎంతో మంచిది’ అని ఈ బ్యూటీ రాసుకొచ్చింది. కాగా, షూటింగ్లో భాగంగా తమన్నా …
Read More »భోజనం తర్వాత తమలపాకులు తింటే
భోజనం తర్వాత తమలపాకులు తింటే.. అనేక ప్రయోజనాలు ఉంటాయి. *తమలపాకు రసాన్ని గొంతుపై రుద్దితే మంట, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి. *గాయాలపై తమలపాకుల రసం రాస్తే త్వరగా మానిపోతాయి. *కొబ్బరినూనెలో తమలపాకు రసం కలిపి రాస్తే.. వెన్నునొప్పి తగ్గుతుంది. *తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు తగ్గుతుంది. * అజీర్తి చేసినపుడు తమలపాకులు నమిలితే అరుగుదల పెరుగుతుంది. * ఉతమలపాకులతో తింటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
Read More »CM నవీన్ పట్నాయక్ కాన్వాయ్ పై గుడ్ల దాడి
ఒడిషాలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై గుడ్ల దాడి జరగటం సంచలనం సృష్టించింది. పూరీలో ఓ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి.. సీఎం నవీన్ హజరై తిరిగి వస్తుండగా.. ఆయన కాన్వాయ్ పై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు గుడ్లతో దాడి చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని దుండగులు కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేసిన ఘటనపై.. బీజేవైఎం రాష్ట్రంలో నిరసనలు చేపట్టింది. ఈ క్రమంలోనే.. ముఖ్యమంత్రి కారుపై గుడ్లు విసిరారు.
Read More »ఆర్టీసీ ఛైర్మన్, MLA బాజిరెడ్డి గోవర్ధన్ సంచలన నిర్ణయం
తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్, నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ జీతభత్యాలు తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై టీఎస్ ఆర్టీసీ ఎండీకి లేఖ ఇచ్చారు. తనకు శాసనసభ్యుడిగా వస్తున్న జీతభత్యాలు చాలని పేర్కొన్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీ సంస్థపై భారం మోపడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read More »అజీర్తికి చెక్ పెట్టండిలా!
అజీర్తికి చెక్ పెట్టండిలా! . జీర్ణవ్యవస్థ చురుగ్గా పని చేయాలంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు అధికంగా తినాలి. . దోసకాయలు తరచూ తినడం ద్వారా జీర్ణ వ్యవస్థకు అవసరమైన ఎంజైమ్లు లభిస్తాయి. . పైనాపిల్లో లభించే డైజెస్టివ్ ఎంజైమ్లు, ప్రోటీన్లు, పిండి పదార్ధాలు.. ఆహారం తేలిగ్గా అరిగేలా చేస్తాయి. • కివీ పండ్లలో ఉండే లక్షణాలు కడుపుకు చాలా మంచివి. • బొప్పాయి కూడా అజీర్ణ …
Read More »