దేశంలో ఈ నెల నుంచే కరోనా థర్డ్‌వేవ్ (మూడో ఉద్ధృతి) ప్రారంభమయ్యే అవకాశమున్నదని పరిశోధకులు తెలిపారు. అక్టోబర్‌లో కేసుల సంఖ్య గరిష్ఠ స్థాయికి చేరవచ్చని పేర్కొన్నారు. ఈ సమయంలో రోజువారీ కేసులు గరిష్ఠంగా లక్షన్నర వరకు నమోదవ్వచ్చని అంచనా వేశారు. అయితే, సెకండ్‌వేవ్‌తో పోలిస్తే, థర్డ్‌వేవ్ తీవ్రత తక్కువేనని తెలిపారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ మతుకుమల్లి విద్యాసాగర్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన మణీంద్ర అగర్వాల్ మ్యాథమెటికల్ …
Read More »తెలంగాణ రాష్ట్రంలో 51 శాతం మందికి తొలి డోసు పూర్తి
కరోనాను ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం. ఎంత ఎక్కువ మంది వ్యాక్సిన్ వేసుకుంటే, అంత త్వరగా వైరస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ సూత్రాన్ని తెలంగాణ సర్కారు పక్కాగా అమలు చేసింది. జనవరి 16 నుంచి ఇప్పటి వరకు తొలి డోసు తీసుకున్న వారి సంఖ్య రాష్ట్రంలో 51 శాతానికి చేరింది. వ్యాక్సిన్ తీసుకోని 25 శాతం మందిలో ప్రతిరక్షకాలు ఉన్నట్టు సీరో సర్వే ఇటీవల వెల్లడించింది. మొత్తంగా 76 …
Read More »ఉప ఎన్నికలో గెలుపు “గులాబీ”దే
హుజురాబాద్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ విజయం తథ్యమని, 50 వేల మెజార్టీతో గెలుపును సి ఎం కేసీఆర్ కు బహుమతిగా అందివ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపునిచ్చారు. సోమవారం హుజురాబాద్ రూరల్, టౌన్ కు సంబంధించిన ముఖ్య కార్యకర్తల, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తల సమావేశం సిద్దిపేట జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి రావు మాట్లాడుతూ హుజురాబాద్ లో టిఆర్ఎస్, బీజేపీ …
Read More »సీఎం కేసీఆర్ ప్రశ్నకు జవాబేది?
‘దళితబంధు’ పథకాన్ని హుజూరాబాద్ నుంచి ప్రారంభించటం గురించి చాలా చర్చ జరుగుతున్నది. ఈ పథకం ఉప ఎన్నిక లబ్ధి కోసమన్నది విమర్శ కాగా, పథకానికి నిధులు గత బడ్జెట్‌లోనే కేటాయించామన్నది ప్రభుత్వ వివరణ. అదే సమయంలో, ఒకవేళ ఎన్నికల ప్రయోజనానికి ఒక చర్య తీసుకుంటే తప్పేమిటనే మౌలికమైన ప్రశ్నను కేసీఆర్ లేవనెత్తుతున్నారు. ఇందుకెవరూ జవాబివ్వటం లేదు. ఇది ఎప్పటికైనా చర్చించవలసిన ప్రశ్నే. దళితుల పట్ల కేసీఆర్‌కు గల తపన గురించి …
Read More »మంత్రి ఎర్రబెల్లితో నిర్మాత అల్లు అరవింద్ భేటీ
ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం బంజారాహిల్స్ లో మంత్రుల క్యాంపు కార్యాలయం లో రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఏడెళ్ళ కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. రాష్ట్రంలో చలనచిత్ర రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళల …
Read More »మాజీ మంత్రి జానారెడ్డిపై సీఎం కేసీఆర్ ఫైర్
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ చురకలంటించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియాలో సమీక్ష నిర్వహించిన సందర్భంగా జానారెడ్డిపై కేసీఆర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో.. శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు జానారెడ్డి ప్రతిపక్ష నాయకుడు. 2 ఏండ్లలో కరెంట్ వ్యవస్థను మంచిగా చేసి.. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పితే జానారెడ్డి ఎగతాళి చేసిండు. రెండేండ్లు కాదు 20 ఏండ్లు అయినా పూర్తి …
Read More »బాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కి మరో అరుదైన గౌరవం
కోవిడ్ సమయంలో ఎందో ఆపన్నులకు సాయం చేసి తన పెద్ద మనసు చాటుకోవడమే కాకుండా.. అత్యవసర సమయాల్లో పేదలకు అండగా నిలబడుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నబాలీవుడ్ స్టార్ సోనూసూద్‌కి మరో అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది రష్యాలో జరగబోయే స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ వింటర్ గేమ్స్‌కు భారత్ తరపున సోనూసూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇది తనకెంతో ప్రత్యేకమని, స్పెషల్ ఒలింపిక్స్ భారత్ జట్టు తరపున చేరినందుకు ఆనందంగా, …
Read More »ఆంధ్రా వాళ్లు చేస్తున్నది దాదాగిరీ
కృష్ణా జలాల వివాదంపై నాగార్జున సాగర్ వేదికగా సీఎం కేసీఆర్ స్పందించారు. హాలియాలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం, ఏపీ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై నిప్పులు చెరిగారు. కేంద్ర ప్రభుత్వం అవలంభించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు. ఆంధ్రా వాళ్లు చేస్తున్న దాదాగిరీ కావొచ్చు. కృష్ణా నదిపై ఏ విధంగా అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. కృష్ణా నీళ్లలో రాబోయే రోజుల్లో మనకు ఇబ్బంది …
Read More »నాగార్జున సాగర్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
నాగార్జున సాగర్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సాగర్ ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సాగర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 150 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై హాలియా మార్కెట్‌యార్డులో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగర్ ఉప ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్నిచ్చి ముందుకు నడిపించినందుకు …
Read More »బండ్ల గణేష్ దాతృత్వానికి నెటిజన్లు ఫిదా
ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలిచే బండ్ల గణేష్ ఈ మధ్య సేవా కార్యక్రమాలతో హాట్ టాపిక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న బండ్ల గణేష్‌కు పలువురు నెటిజన్స్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారు ఆదుకోవాలని కోరుతుండగా, బండ్ల వెంటనే స్పందిస్తూ తన వంతు సాయం చేస్తున్నారు. ఇటీవల ఓ నెటిజన్.. తన అన్నయ్య బండ్ల లింగయ్యకు ఆటో ప్రమాదం జరిగిందని, ఆపరేషన్ చేసి 48 కుట్లు …
Read More »