తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు. …
Read More »సిద్ధిపేటలో త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ప్రారంభం
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ పరిధిలో మూడవ పట్టణ- త్రీ టౌన్ పోలీసు స్టేషన్ ను పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ లతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర మండల …
Read More »జగిత్యాలకు కిసాన్ రైలు
తెలంగాణలోని జగిత్యాల మామిడికి ఉత్తర భారతదేశంలో మంచి డిమాండ్ ఉంది. మంచి రంగు, రుచి, వాసన ఉండటంతో.. ఇక్కడ కొనుగోలు చేసిన మామిడిని వ్యాపారులు ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌కు తరలిస్తుంటారు. అయితే డిజీల్, పెట్రోల్ ధరలు అమాంతం పెరగడంతో.. రైలు మార్గంలో మామిడికాయలను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు జగిత్యాల – లింగంపేట రైల్వే స్టేషన్‌కు కిసాన్ రైలు చేరుకోనుంది. తిరిగి రాత్రి …
Read More »భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత కుంజా బొజ్జి (95) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భద్రాచలం దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. కుంజా బొజ్జి భద్రాచలం నుంచి మూడుసార్లు సీపీఎం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అడవి వెంకన్న గూడెం.
Read More »మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామర్థ్యం 8 లక్షల లీటర్లు. వాటర్ ట్యాంకు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో …
Read More »ఏపీలో కొత్తగా 3,309 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 3,309 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 31,929 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. చిత్తూరులో అత్యధికంగా 740 కేసులు వెలుగులోకి వచ్చినట్టు ఆరోగ్య శాఖ బులెటిన్ ద్వారా తెలిపింది. గుంటూరులో 527, విశాఖపట్నంలో 391, కర్నూలులో 296, కృష్ణాలో 278, శ్రీకాకుళంలో 279, ప్రకాశంలో 174 కేసులు వెలుగులోకి …
Read More »కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మృతి
అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, హిందూపురం మాజీ ఎమ్మెల్యే కామగానహళ్లి తిప్పేస్వామి(80) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. పరిగి మండలం సేవా మందిరంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1941లో ఏప్రిల్ 6న జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సేవా మందిర్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సొంత స్థలంలో …
Read More »‘సబ్బండ కులాల’ సమున్నతాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం..
కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన, బహుజన తత్వవేత్త సామాజిక దార్శనికుడు, మహాత్మా జ్యోతిరావు ఫూలే 195 వ జయంతి ( 11 ఏప్రిల్) ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు నివాళులు అర్పించారు. దేశానికి ఫూలే అందించిన సేవలను ఈ సందర్భంగా సిఎం స్మరించుకున్నారు. వర్ణ వివక్షను రూపుమాపడం కోసం, దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతికోసం, మహాత్మాఫూలే ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని …
Read More »దేశంలో కొత్తగా 1,52,879 కరోనా కేసులు
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా మరో 839 మంది ప్రాణాలు …
Read More »తెలంగాణలో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పంజా విసురుతోంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,187 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజాగా మరో 787 మంది కోలుకొని ఇండ్లకు వెళ్లారు. రాష్ట్రంలో 20,184 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 13,336 మంది బాధితులున్నారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల …
Read More »