కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని వణికిస్తోంది. రోజులు గడిచినా కొద్ది వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత కొద్ది రోజులుగా రోజు వారీ కొవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
నిత్యం రికార్డు స్థాయిలో పెరుగుతూ వస్తున్న కేసులు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,52,879 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్తగా మరో 839 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805కు చేరాయి.