తెలంగాణ రాష్ట్రంలో గతరాత్రి గం.8 వరకు కొత్తగా 163 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,99,086కు చేరింది. ఇక నిన్న కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,635కు పెరిగింది. నిన్న వైరస్ బారి నుంచి 157 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,907 యాక్టివ్ కేసులున్నాయి..
Read More »హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ హిమా కోహ్లీతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. సీజే హిమా కోహ్లీని సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది జనవరిలో తెలంగాణ హైకోర్టు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులైన విషయం తెలిసిందే.
Read More »తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ టీఆర్ఎస్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, బహదూర్ పల్లి గ్రామంలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ లో రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశానికి ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బలపర్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి గారిని రాబోయే …
Read More »అభిషేక్ శర్మ రికార్డు
సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ ప్లేయర్ అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో అదరగొట్టాడు.లిస్ట్-ఏ ఫార్మాట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మధ్య ప్రదేశ్ తో మ్యాచులో ఈ పంజాబ్ ఆల్ రౌండర్ 42 బంతుల్లోనే సెంచరీ చేశాడు. మొత్తం 8 ఫోర్లు, 9 సిక్సర్లతో 104 రన్స్ చేసి ఔటయ్యాడు గతంలో 40 బంతుల్లోనే సెంచరీ చేసిన యూసుఫ్ పఠాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. …
Read More »బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రారావుకి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన మంత్రి కేటీఆర్
తెలంగాణలో విద్య, ఉద్యోగాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు విసిరిన సవాలుకు మంత్రి కేటీఆర్ దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ గేటు బయట సోమవారం ఉదయం 11 గంటల కల్లా వస్తాను.. మీరూ రండి.. చర్చిద్దాం అంటూ ఆదివారం రామచందర్‌రావు ట్వీట్ చేశారు. దీనిపై సోమవారం ట్విటర్‌లో కేటీఆర్ స్పందించారు. గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇస్తానన్న 12 కోట్ల ఉద్యోగాలు (ఏడాదికి …
Read More »షర్మిల పార్టీపై మంత్రి గంగుల సంచలన వ్యాఖ్యలు
కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీలకు అవకాశం లేదని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందించిన ఆయన.. ’90శాతం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారు. టీఆర్ఎస్ ను తమ పార్టీగా ప్రజలు భావిస్తారు. తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్ ఉండగా.. కోడలైన షర్మిల మా రాష్ట్రానికి అవసరం లేదు. టీఆర్ఎస్ ను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఆస్తి’ అని …
Read More »TOP -10 లో రోహిత్ శర్మ
స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ICC ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి ఎగబాకాడు. హిట్ మ్యాన్ కు 742 పాయింట్లు ఉండగా విరాట్ 836 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. పూజారా 10వ ర్యాంకులో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్ మూడో ర్యాంకులో ఉండగా, బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.
Read More »పిల్లలకు ఇవి తినిపించండి
పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు గింజలు, డ్రైప్రూట్స్ ఇవ్వండి సీజనల్ పండ్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలు చాక్లెట్లు, కేకులు, చిప్స్, నూడుల్స్ లాంటి 3. చిరుతిళ్లు ఇష్టపడుతారు. వాటితో కొవ్వు శాతం పెరుగుతుంది. ఇంట్లోనే హెల్తీ స్నాక్స్ చేసి పెట్టండి . మీరు ఏం తింటారో చూసి పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. కాబట్టి మీరు జంక్ ఫుడ్ కు దూరంగా ఉండండి
Read More »టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య-మంత్రి రాజీనామా
మహరాష్ట్రలో శివసేన నేత సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకు అందించిన రాథోడ్.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా టిక్ టాక్ స్టార్, మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్యకు సంజయ్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేశారు.
Read More »నిర్మాతగా నేచూరల్ స్టార్ నాని
నేచూరల్ స్టార్ నాని నిర్మాతగా.. విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం HIT. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ విడుదలై నేటికి సరిగ్గా ఏడాది ఈ నేపథ్యంలో HIT మూవీ సీక్వెల్ ను నిర్మాత నాని ప్రకటించాడు. గతంలో విక్రమ్ రుద్ర రాజు తెలంగాణ రోల్ లో నటిస్తే.. ఈ సారి ఏపీలో స్టోరీ ఉంటుందని నాని తెలిపాడు. త్వరలోనే ఈ సినిమాకు …
Read More »