కాంగ్రెస్ పార్టీ నాయకులకు రాష్ట్ర యువనేత, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో సారి ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళ్తే..కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కాలంతో పోలిస్తే.. టీఆర్ఎస్ పార్టీ హయంలో ఇసుక ద్వార ప్రభుత్వాని వచ్చే ఆదాయం వంద రెట్లు పెరిగిందని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
see also :అసెంబ్లీ సాక్షిగా పప్పులో కాలేసిన చిన్నబాబు ..!
2004 నుండి 2014వరకు ఇసుక ద్వారా సగటున సంవత్సరానికి 4 కోట్ల చొప్పున 39 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వచ్చిందని..తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత టీఆర్ఎస్ హయంలో 2014 నుండి 2018 వరకు 1609 కోట్ల రూపాయలకు చేరుకొందని… అంటే ఇంచుమించు ఏడాదికి రూ.400 కోట్లకుపైగా ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్లిందని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
see also :ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి.!!
వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇసుక మాఫియాను అరికట్టాలంటూ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న చందాన కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ వరుసగా ట్వీట్ చేశారు.
A staggering statistic from Mining review:
From 2004-14, revenue to the state from Sand – Rs. 39.84Cr (Avg about 4Cr per annum)
From 2014-18, revenue to the state from Sand – Rs. 1609Cr (Avg 400Cr per annum)
A 100 fold increase! Wonder where all this money had gone back then??
— KTR (@KTRTRS) March 17, 2018
And on top of this, Scamgress has the audacity to preach about curbing “Sand Mafia”?
Ulta Chor Kothwal Ko Daante !! https://t.co/rmxTAxPAX8
— KTR (@KTRTRS) March 17, 2018