Breaking News
Home / MOVIES / రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్

రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్

కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్ రానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర గురించి కాకుండా గత ఆరేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ నేతృత్వంలో పతనమైన తీరు… పార్టీ పతనా వ్యవస్థ..నాయకుడిగా రాహుల్ విఫలమైన తీరుపై వెబ్ సిరీస్ తీస్తాను.

రాహుల్ గాంధీపై సోనియా గాంధీ చూపించే పుత్ర ప్రేమను ఇందులో చూపిస్తానని మాజీ జర్నలిస్ట్ పంకజ్ శంకర్ తెలిపారు.గతంలో కరుడగట్టిన కాంగ్రెస్ వాది అయిన పంకజ్ ప్రస్తుతం రాహుల్ పై వెబ్ సిరీస్ నిర్మించడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది .