Home / NATIONAL / మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం

ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 105,శివసేన 56,కాంగ్రెస్ 44,ఎన్సీపీ 54,ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందాయి. అయితే మహారాష్ట్ర గవర్నర్ బీజేపీ పార్టీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పడ్నవీస్ మాత్రం మాకు అంత మెజారిటీ లేదని తేల్చి చెప్పారు.

దీంతో బీజేపీ మిత్ర పక్షమైన శివసేనను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అయితే బీజేపీతో చర్చలు విఫలమవ్వడంతో శివసేన ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీలతో చర్చలు జరుపుతుందని వార్తలు ఆ రాష్ట్రంలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ వార్తలకు బలం చేకూరే విధంగా గత పార్లమెంటెన్నికల్లో శివసేన తరపున గెలుపొంది.. బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న శివసేన ఎంపీ అరవింద్ సావంత్ ఆ పదవీకి రాజీనామా చేయనున్నారని వార్తలు వస్తోన్నాయి. ప్రస్తుతం ఆయన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు.