Breaking News
Home / 18+ / బాలీవుడ్ నటి గీత కన్నుమూత…!

బాలీవుడ్ నటి గీత కన్నుమూత…!

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలనాటి బాలీవుడ్ నటి గీతా సిద్ధార్థ కక్ శనివారం ముంబైలో కన్నుమూశారు. సరిగ్గా నలబై ఏడేళ్ల కిందట అంటే 1972లో గుల్జార్ మూవీ ద్వారా గీత  పరిచయమయ్యారు. ఆ తర్వాత ఏడాది 1973లో దేశ విభజన అనంతరం జరిగిన పరిణామాలపై ఎంఎస్ సాత్యు తీసిన గరమ్ హవాలో నటించిన పాత్ర ద్వారా గీత గుర్తింపును  పొందారు. ఈ సినిమాకు ఉత్తమ జాతీయ ఐక్యతా చిత్రం కేటగిరిలో జాతీయ అవార్డును లభించింది. అమీనా పాత్ర పోషించిన గీతా ప్రత్యేక స్మారక పురస్కారాన్ని సైతం
అందుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు హిట్ చిత్రాలైన షోలే,త్రిశూల్ ,డిస్కో డాన్సర్,రామ్ తేరి గంగా మైలి,నూరియా , దేశ్ ప్రేమీ, డాన్స్ డాన్స్ లాంటి పలు చిత్రాల్లో తనదైన  నటనతో ఆకట్టుకున్నారు. ప్రముఖ టీవీ డాక్యుమెంటరీ నిర్మాత సిద్ధార్థ కక్ తో ఆమె వివాహాం జరిగింది. గీత మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.