Home / SLIDER / ఆదర్శంగా నిలిచిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

ఆదర్శంగా నిలిచిన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది

అతనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే మేడారం సమ్మక్క సారలమ్మ లను దర్శించుకోవాలని తలచాడు.. అతనికి కారు ఉంది..వీఐపీ దర్శనానికి అవకాశం కూడా ఉంది.. కానీ వీఐపీ కల్చర్ వద్దనుకున్నాడు..ప్రజలకు ఇబ్బంది కలగకూడదనుకున్నాడు అందుకే TSRTC బస్సు ఎక్కాడు..అతనెవరో కాదు నర్సంపేట ఎమ్మెల్యే ఉద్యమనేత శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు..వీఐపీ దర్శనం వద్దు సామాన్య దర్శనం ముద్దు అనే అతని నిర్ణయం ఇతర నేతలకు ఆదర్శంగా నిలుస్తుంది..

మేడారం జాతర నేపద్యంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వీఐపీ కల్చర్ వద్దంటూ ఈ రోజు తన సతీమణి వరంగల్ రూరల్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న గారితో కలిసి నర్సంపేటలో ఆర్టీసి బస్సెక్కారు..అతను మాత్రమే కాకుండా తన చుట్టూ ఉండే నాయకులు కార్యకర్తలు మేము సైతం అంటూ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేసారు..నేరుగా బస్సులో గట్టమ్మ దగ్గర పూజలు నిర్వహించి అనంతరం సమ్మక్క సారలమ్మల దగ్గరకు వెల్లి ఆ తల్లులను దర్శించుకున్నారు..

దీనికి కారణం లేకపోలేదు.తాను ఉద్యమసమయంలో జిల్లా అద్యక్షునిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని జాతరకు ఆహ్వానించారు..ఆ క్రమంలో అప్పుడున్న ప్రభుత్వంలో వీఐపీ దర్శనాల వల్ల ప్రజలు పడిన ఇబ్బందులు ఆయన స్వయంగా వీక్షించాడు అందుకే ఎప్పుడూ అతను ఇలా సాదా సీదాగా సామాన్య జనాలతో కలిసి బస్సులో వెలతారు..ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం ,ప్రజల్లో కూడా ఆర్టీసి పై మరింత నమ్మకం పెరిగేందుకు,వీఐపీ దర్శనం వద్దంటూ సామాన్యుడిలా ఆయన వారితో కలిసి మేడారం జాతర వెల్లారు.. నిజమే కదా నాయకుడంటే నలుగురికి ఆదర్శంగా నిలవాలి..నలుగురితో కలిసి నడవాలి..ప్రజల్లో ఒకడిగా ఉండాలి అందుకే పెద్ది మంచి ప్రజా నాయకుడు.. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం నలుగురికి ఆదర్శంగా నిలుస్తుంది..