Home / SLIDER / తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 27,612 కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 11,012 ఉన్నాయి. ఇవాళ 1506 మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 16,287 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఇవాళ కరోనాతో 7 మంది మృతిచెందారు.ఇప్పటివరకు 313 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC పరిధిలోనే 1422 కేసులు ఉన్నాయి.