ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ,బీజేపీ మిత్రపక్షాలు ఐదున్నర కోట్ల ఆంధ్రుల కోసం కురిపించిన ఎన్నికల హామీలలో ఒకటి స్పెషల్ స్టేటస్ .అయితే గత నాలుగు ఏండ్లుగా ఏపీకి స్పెషల్ స్టేటస్ అవసరంలేదు.
ప్రత్యేక ఫ్యాకేజీ చాలు అని కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ఫ్యాకేజీ కు కృతజ్ఞతగా అప్పటి కేంద్ర మంత్రి ,ఇప్పటీ ఉప రాష్ట్రపతి అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడును రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతూ సన్మానాలు సత్కారాలు చేశారు ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు .అయితే అదే ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ పలు పోరాటాలు ,ఉద్యమాలు చేశారు .
అయితే ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి తెలంగాణ టీడీపీ నుండి సస్పెండ్ అయిన సీనియర్ మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు మీడియాతో మాట్లాడుతూ ఏపీకి నమ్మశక్యం కానీ అమలు చేయలేని ఆరు వందల హామీలను కురిపించి అధికారంలోకి వచ్చిన బాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడు.కాపులను ,దళితులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ఉన్నత వర్గాల ఆదేశాల మేరకు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు.ఐదున్నర కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు ఆధారపడిన స్పెషల్ స్టేటస్ ను సాధించడం బాబు వలన కాదు .చంద్రబాబు ఒక దద్దమ్మ ..జగన్ ఒక్కడే మగాడు .జగన్ మాత్రమే స్పెషల్ స్టేటస్ తీసుకురాగల మగాడు అని ఆయన అన్నారు ..