నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది… మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వైపు అంతిమయాత్ర సాగుతోంది… హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు… నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను తన భుజంమై మోసి… అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలో ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు… అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, జస్టిస్ చలమేశ్వర్ తదితరులుండగా నందమూరి కుటుంబ సభ్యులు, ఏపీ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు అనుసరిస్తున్నారు. అంతిమయాత్రకు భారీ సంఖ్యలు టీడీపీ శ్రేణుల, హరికృష్ణ అభిమానులు తరలిరావడంతో మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం రోడు జనసంద్రమైంది. మరోవైపు మహాప్రస్థానానికి కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారుమెహదీపట్నం ఎన్‌ఎండీసీలోని హరికృష్ణ ఇంటినుంచి సరోజిని దేవికంటిఆస్పత్రి, మెహదీపట్నం, రేతిబౌలి, నానల్‌నగర్, టోలిచౌకి ఫ్లైఓవర్, కేఎఫ్‌సీ, అర్చెన్ మార్బెల్స్, షేక్‌పేట్‌నాలా, ఒయాసిస్ స్కూల్, విస్పర్ వ్యాలీ జంక్షన్ మీదుగా కుడివైపునకు తిరిగి జేఆర్సీ కన్వెన్షన్ మీదుగా మహాప్రస్థానానికి చేరుకోనుంది. సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరగనున్నాయి.
