తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఎన్నికలకు ముందు డిసెంబర్ తొమ్మిదో తారీఖున రైతుబంధు డబ్బులు వేస్తాము.. బ్యాంకులకెళ్ళి రెండు లక్షల రుణాలను తెచ్చుకోండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫీ చేస్తామని అప్పటి పీసీసీ చీఫ్.. ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చిన సంగతి తెల్సిందే.
తాజాగా రైతుబంధు డబ్బులపై కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరు నుండి రైతుబంధు డబ్బులను రైతుల ఖాతాల్లో వేస్తామని తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారమే ఎకరాకు ఏడాదికి ఏడున్నర వేల రూపాయలు ఇస్తామని ఆయన అన్నారు.