తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి ఈ రోజు ఆదివారం సికింద్రాబాద్ లో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును పరామర్శించారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” ఆయన త్వరగా కోలుకోవాలి.. తిరిగి మళ్లీ అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజాసమస్యలను ప్రస్తావించాలి అని కోరుకుంటున్నాను.
కొత్త ప్రభుత్వానికి కేసీఆర్ సలహాలు.. సూచనలు కావాలని కోరాము. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యసేవలు అందించాలని సంబంధితాధికారులను ఆదేశించాను అని అన్నారు.