రాష్ట్రంలో ఫ్యాన్ గాలి భారీగా వీస్తుంది..జగన్ దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తేల్చడం,తాజాగా వచ్చిన సర్వే లో కూడా అదే స్పష్టమవడంతో తెలుగుదేశం పార్టీకి ఏమి చెయ్యాలో తెలియడం లేదు. ఫ్యాను దెబ్బకు నామినేషన్లకు ముందే కకావికలమై పోతోంది.జగన్ గెలుపు తథ్యమని చంద్రబాబు కి అర్దమవడంతో ఎప్పుడు టీడీపీ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఏది తేల్చుకోలేకపోతున్నారు. అయితే బాబు ఇప్పటివరకు 141 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే ప్రకటించగా వీరిలో కొంతమందిపై పార్టీలో తీవ్ర అసమ్మతి రావడం గమనార్హం.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మాత్రం ఒకేసారి 175 అసెంబ్లీ స్థానాలకు, అన్ని ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించి రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. ఇది ఇలావుండగా వైసీపీ విజయం తధ్యం అనే నేపథ్యంలో టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల్లో పలువురు ఓడిపోతారని భయపడి విముఖత చూపిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి టీడీపీ నుంచి పోటీకి నిరాకరించి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నుండి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తాజాగా కర్నూలు జిల్లా శ్రీశైలం అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి కూడా పోటీకి వెనుకంజ వేశారు. దీంతో ఆయన సోదరుడు బుడ్డా శేషారెడ్డిని పోటీ చేయించాలని టీడీపీ అధిష్ఠానం చూస్తున్నా ఆయన కూడా భయపడుతునట్టు సమాచారం. పాణ్యం టిక్కెట్‌ను ఆశించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిని శ్రీశైలం నుంచి పోటీకి సంప్రదించగా ఆయన కూడా నిరాకరించారని చెబుతున్నారు.