Home / 18+ / యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..

యంగ్ హీరోయిన్స్ దూకుడుకి తట్టుకోలేక సెలైంట్ అయిన కాజల్..

కాజల్ అగర్వాల్..2008లో చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ తరువాత 2009లో రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో జత కలిసింది.టాలీవుడ్ లో కాజల్ కు మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం ఇదే.ఆ తరువాత హీరో రామ్ పోతినేని తో కలిసి గణేష్ మరియు అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది.2010లో డార్లింగ్ తో ముందుకు వచ్చిన కాజల్ కుర్రకారుకు ఒక ఊపు తెప్పించింది.ఆ తరువాత బృందావనం,మిస్టర్ పర్ఫెక్ట్,తమిళ హీరో కార్తీ సరసన నా పేరు శివ చిత్రంలో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేసింది.ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ సరసన బిజినెస్ మాన్ లో మంచి రొమాంటిక్ గా కనిపించింది.తన నటనకు గాను మంచి పేరు తెచ్చుకున్న ప్రస్తుతం యంగ్ హీరోయిన్స్ ధాటికి ఛాన్స్ లు తగ్గినాయని చెప్పుకోవాలి.ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ లో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ వాళ్ళ నటనతో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.కాజల్ కూడా ఇంక తనకి ఛాన్స్ రావు అన్నటుగానే మోడలింగ్ చేస్తుందని సమాచారం.