సంతకం ఫోర్జరీకేసులో ఇరుక్కుని టీవీ9 సీఈవో బాధ్యతలను పొగొట్టుకున్న రవిప్రకాశ్ గత కొంతకాలంగా మాయమైపోయిన సంగతి విదితమే.ఈ క్రమంలో తనకు బెయిల్ ఇవ్వాలని అజ్ఞాతంలో ఉన్న రవిప్రకాశ్ తన న్యాయవాది ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పిటిషన్ ధాఖలు చేయించాడు. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం బెయిల్ గురించి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం అయిన హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అయితే రవిప్రకాశ్ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 10న విచారించి నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే రవిప్రకాశ్ ను అరెస్టు చేయాలంటే మాత్రం అతనికి నలబై ఎనిమిది గంటలకు ముందు నోటీసులివ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
