బాలీవుడ్ దివంగత నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ తన బెల్లీ డ్యాన్స్‌తో సోషల్ మీడియాను షెక్ చేస్తున్నారు. ఆమె ‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్‌లో పాల్గొంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ‘‘డ్యాన్స్ దివానే’ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు శశాంక్ ఖైతాన్’ అని జాన్వి పోస్ట్ చేశారు. ఇందులో ఆమె పొట్టి దుస్తుల్లో బెల్లీ డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మీరు ఆ వీడియో చూడండి.
