దేశ వ్యాప్తంగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నవారికి కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త ఇళ్లును నిర్మించుకోవాలని అనుకుంటున్నవారికి మరింత చేయూతనిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా తెలిపారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ” రూ.45లక్షల లోపు గృహారుణాలపై రూ.3.5లక్షలవరకు వడ్డీ మినహాయింపు ఇస్తామని”తెలిపారు. పదిహేను సంవత్సరాల గరిష్ఠ కాలపరిమితితో 2020 మార్చి 31లోపు రుణాలు తీసుకునేవారికి ఇది వర్తిస్తుందని చెప్పారు.
