కేంద్ర ప్రభుత్వం 800ల పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందన్న అబద్ధాలపై సుప్రీంకోర్టు సీరియస్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్ నిరాధార పౌరులకు ఏమూలకు సరిపోతుందని ఏ రకంగా ఆసర కాగలదని ప్రశ్నించింది.
పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా తిరుగుతుంటే వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే వారు ఉగ్రవాదులకన్నా ప్రమాదం అని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది . పేదలు నిరాధార పౌరులకు 200 రూపాయలకు మించి పెన్షన్ ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి కుదరటం లేదు కానీ ఇలాంటి ఆర్థిక నేరస్తులకు వేల కోట్ల రూపాయల రుణాలను ఎలా ఇస్తారని ప్రశ్నించింది.
పేద ప్రజలకు ఇచ్చే ఆసరా పెన్షన్ లలో 200 రూపాయలకంటే ఎక్కువ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సుప్రీంకోర్టు మోడీ ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందడం ప్రతీ పౌరుడి హక్కు అని ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని సుప్రీంకోర్టు ఘాటుగా హెచ్చరించింది..
Post Views: 254