కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత,కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి(77) శ్వాస సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లారుజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సోమవారం ఆయన
భౌతికాయానికి అంత్యక్రియలు జరగనున్నయి.ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ జీవితం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం
సూదిని జైపాల్ రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే విద్యార్థి నాయకుడిగా 1960దశకంలో రెండు సార్లు వర్సిటీ అధ్యక్షునిగా ఎన్నిక
దివంగత మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి ప్రేరణతో జైపాల్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు
1964లో గుంటూరులో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఆపార్టీ తీర్థం పుచ్చుకున్నారు
1965నుండి ఆరేళ్లపాటు ఆ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక
ఆ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియామకం
1969లో కల్వకుర్తి అసెంబ్లీ నుండి ఉపఎన్నికల్లో తొలిగెలుపు
తర్వాత కాసుబ్రహ్మనందరెడ్డి స్థాపించిన కాంగ్రెస్ లో చేరిక
అనంతరం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక
1977లో ఎమర్జెన్సీని వ్యతిరేకించి జనతాపార్టీలో చేరిక
1978,83లో కల్వకుర్తి నుండి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపు
1969-1984మధ్య నాలుగు సార్లు (కాంగ్రెస్ 2,జనతా పార్టీ2)శాసనసభకు ఎన్నిక
1984లో మహబూబ్ నగర్ ఎంపీ(జనతాపార్టీ అభ్యర్థి)గా గెలిచి పార్లమెంట్లోకి అడుగు
1989లో అక్కడ నుండి జనతాదళ్ అభ్యర్థిగా రెండోసారి విజయం
1999లో మరల తిరిగి కాంగ్రెస్ గూటికి
1999,2004లో మిర్యాలగూడ ,2009లో చేవెళ్ల నుంచి ఎంపీగా ఘనవిజయం
1990-96,1997-98లో రాజసభ సభ్యునిగా ఎంపిక
ఏఐసీసీ అధికార ప్రతినిధిగా పదవీ బాధ్యతలు
