f2 మూవీలో వైఫ్ కార్యక్టర్‌లో ఇరగదీసిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమ్మన్నా…ఇప్పుడు నిజజీవితంలో ఒకరికి వైఫ్ కానుంది. గత కొంత కాలంగా తమన్నా మ్యారేజీ చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. కాని తమ్మన్నా మాత్రం “మ్యారేజీనా..అలాంటిదేం లేదు..కెరీర్‌కే ఫస్ట్ ప్రియారిటీ” అని కబుర్లు చెప్పింది. అయితే తాజాగా త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు ఈ మిల్కీ బ్యూటీ నిజం ఒప్పుకుంది. రీసెంట్‌గా తమన్నా పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయట. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్నా చెప్పుకొచ్చింది. ఇంట్లో తన కోసం వరుడిని వెతుకుతున్నారని, తాను కూడా ఓకే చెప్పినట్లు తమ్మూ బ్యూటీ ప్రకటించింది. ప్రస్తుతం పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఎవరూ ఇంకా ఫైనల్ కాలేదని స్పష్టం చేశారు. పెళ్లి విషయంలో పూర్తి నిర్ణయం అమ్మా నాన్నకే వదిలేశాను, వారు చూపించిన అబ్బాయిని చేసుకుంటానని తమన్నా చెప్పుకొచ్చారు. నాకు ఎలాంటి వాడు కావాలో నాకంటే అమ్మానాన్నకే బాగా తెలుసు, వారి సెలక్షన్ మీద పూర్తి నమ్మకం ఉందని తమన్నా చెప్పింది. అయితే తమన్నా కొంతకాలంగా ఓ వ్యక్తిని ప్రేమిస్తోందని, అతడితో డేటింగ్ చేస్తోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాను ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించలేదని, ఒక వేళ అలాంటివి ఏమైనా ఉంటే రహస్యంగా చేయాల్సిన అవసరం లేదని తమ్మన్నా స్పష్టం చేసింది. ఇటీవల తమన్నా ముంబైలో ప్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. త్వరలో తమ కూతురు పెళ్లి చేసుకోబోతున్న సందర్భంగా తమన్నా తల్లిదండ్రులు కాబోయే భార్య భర్తలు ఇద్దరి పేరు మీద ఈ ఫ్లాట్ కొనుగోలు చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే తమన్నా మాత్రం తన పెళ్లిప్రయత్నాలు జరుగుతున్న మాట నిజమే కానీ…. వరుడు ఎవరు? అనేది ఇంకా ఫైనలైజ్ కాలేదని అంటోంది. ఇక త్వరలోనే మ్యారేజీ చేసుకుంటున్నానంటూ స్వయంగా తమన్నానే ప్రకటించడంతో ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఇక పెళ్లి అయిన తర్వాత తమ ఫేవరెట్ హీరోయిన్ తమ్మూ సిన్మాల్లో నటిస్తుందో లేదా..మిల్కీ అందాలు ఇక చూడలేమో అంటూ ఫ్యాన్స్ దిగులు చెందుతున్నారు. మొత్తానికి తమన్నా సీరియస్‌గా పెళ్లి ప్రయత్నాలు స్టార్ట్ చేసిందని వస్తున్న వార్తలతో ఫ్యాన్స్ గుండెల్లో బాంబు పేలినట్లయింది.
